దేశంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, రైతులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా.. వారి పక్షాన నిలిచి ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో సాంకేతిక విప్లవం కన్నా రైతు సంక్షేమం ముఖ్యమని రాహుల్ గాందీ అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూ సేకరణ చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కిసాన్ ర్యాలీ జరిగింది. ఈ సంర్భంగా రాహుల్ మాట్లాడుతూ కార్పొరేట్ వర్గాల కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. విదర్భ, బుందేల్‌ఖండ్‌కు యుపీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందని, పేదలను పట్టించుకున్నది యుపీఏ ప్రభుత్వమేనని ఆయన ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
రైతు అనుకూల భూసేకరణ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం మార్చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. బలవంతంగా రైతుల వద్ద నుంచి భూమి లాక్కుంటోందని ఆయన మండిపడ్డారు. ఆదివాసీలను కలిశానని, వారి వికాసం కోసం ఎంత కృషి చేశారని ఆయన తెలిపారు. రైతులకు రుణ మాఫీ చేసింది కూడా యుపీఏ ప్రభుత్వమేనని రాహుల్ పేర్కొన్నారు. రైతుల రుణభారం తగ్గించేందుకు రూ. 70 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఆయన వెల్లడించారు. ఆహారభద్రత చట్టం సహా పేదల కోసం అనేక పనులు చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం పాటుపడిందని, ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసమే పనిచేస్తుందని రాహుల్ విమర్శించారు.
ఎన్డీయే ప్రభుత్వంలో రైతులకు భవిష్యత్ లేదని రాహుల్ విమర్శించారు. ఐటీ కన్నా ముందు దేశంలో వ్యవసాయం ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ విప్లవం గురించి ఆలోచించి రైతులకు మేలు కోసం భూ సంస్కరణ బ్లిల్లు తీసుకువచ్చామననారు. రైతులను ఇబ్బంది పెట్టి, ఉద్యోగాలు ఇవ్వకపోతే యువత నక్సలిజం వైపు మళ్లుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని ఆయన విమర్శించారు. మోదీ విదేశీగడ్డపై భారత్‌ను విమర్శించడం తగదని రాహుల్ సూచించారు. భూసేకరణ బిల్లు తయారు చేసేందుకు మాకు రెండేళ్లు పట్టిందని, దాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఇష్టానుసారంగా బిల్లులో సవరణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. రైతుల కోసం యుపీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చి రైతులను నట్టేట ముంచిందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more