Chandrababu | Legend | AP | CM

Narachandrababu naidu is a legendary leader in ap and indian politics

chandrababu, ap, chandrababu naidu, hitech city, janmabhoomi, dwacra, disha, tdp, ttdp, ntr,

Narachandrababau naidu is a brave leader. He is celebrated his 65the birth day in ntr trust bhavan. Chandrababu naidu worked as ap cm for 9 years. After bifercation of ap, chandrababu become First cm in ap

ITEMVIDEOS: ప్రత్యేకం: తెలుగు వారింట మణిదీపం చంద్రబాబు నాయుడు

Posted: 04/20/2015 01:36 PM IST
Narachandrababu naidu is a legendary leader in ap and indian politics

ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టి తెలుగు రాష్ట్రాన్ని ప్రపంద వేదికపై వెలిగించిన నేత నారా చంద్రబాబు నాయుడు. ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పలల్లాలున్నట్లే చంద్రబాబు నాయుడు జీవితంలో కూడా ఎత్తుపల్లాలున్నాయి. కానీ అర చేతితో సూర్యుడుని ఆపలేమన్నది ఎంత నిజమో కష్టాలు కూడా చంద్రబాబును ఆపలేవన్నది కూడా అంతే నిజం. రెట్టించిన ఉత్సాహంతో కష్టాలను గెలుస్తూనే జీవితపు విజయశిఖరాలను చేరుతున్నారు చంద్రబాబు. తెలుగు వారి కీర్త ప్రతిష్టలను వంద రెట్లు చేసిన.. చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

* 1950లో అమ్మణమ్మ, ఖర్జూరనాయుడు దంపతులకు చంద్రబాబు నాయుడు  పెద్ద కుమారుడు.
*తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.
*చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాడు.
*తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు.
*శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ రాజకీయ వ్యుహచతురత బయటపడింది.
*చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
*కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు.
*1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పని చేశాడు.
* కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె అయిన భువనేశ్వరీ దేవిని 1981, సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నాడు.
*1983లో ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు.
*1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో *తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు.
*1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ *శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పని చేసాడు.
*1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.
*అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం చరిత్ర సృష్టించాడు.

కుటుంబం...
నారా చంద్రబాబునాయుడు, ఎన్.టి.రామారావు కూతురు భువనేశ్వరిని పెళ్ళిచేసుకొని నందమూరి కుటుంబంలో భాగమయ్యాడు. ఈయన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేష్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తెతో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.తాజాగా చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఉగాది రోజు మగ బిడ్డ పుట్టాడు.

పథకాలు...
*జన్మభూమి * నీరు-మీరు, *దీపం, శ్రమదానం *పచ్చదనం-పరిశుభ్రత *ఆదరణ *రోష్ని *డ్వాక్రా * సాగునీటి సంఘాలు  *విద్యా కమిటీలు *వన సంరక్షణ కమిటీలు *రైతు బజార్లు * చేనేత ప్రగతి *ఐటి విప్లవం *పనికి ఆహారం

చంద్రబాబు నాయుడు జీవింతో ముఖ్యమైనవిగా యోగా..

నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎంతో చలాకీగా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఛార్జ్ చేసిన బ్యాటరీలా నవ్వుతూనే.. ప్రజల సమస్యలను వింటారు. చంద్రబాబు ఆరోగ్య రహస్యం యోగా. మనిషి ఒత్తిడికి లోనైతే ఇబ్బందులకు గురికావడంతోపాటు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు దారితీస్తాయని.. వాటిన్నంటిని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి యోగా ఎంతో అవసరమమంటారు చంద్రబాబు.

క్రమశిక్షణకు మారుపేరు చంద్రబాబు నాయుడు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ పక్కాగా పాటించే వ్యక్తని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆరోగ్యపరంగా ఎన్నో నియమాలు పాటిస్తారాయన. మరోవైపు, నైతికతకూ పెద్దపీట వేస్తారు. ఎంతలా అంటే, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నే అబ్బురపరిచేంత! గుంటూరు జిల్లా మోతడకలో చలపతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో బాబు విద్యార్థులతో ఈ విషయాలను పంచుకున్నారు. వివరాల్లోకెళితే.. బాబు సీఎంగా వ్యవహరించిన సమయంలో ఓసారి బిల్ క్లింటన్ భారత పర్యటనకు విచ్చేశారు. అప్పుడు ఢిల్లీలో క్లింటన్ తో సమావేశానికి బాబుకు కూడా ఆహ్వానం అందింది.అమెరికా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తయారు చేశారు చంద్రబాబు. అనుకున్న దానికంటే ముందుగానే ప్రజెంటేషన్ ను తయారుచేియడమే కాకుండా దాన్ని బిల్ క్లింటన్కు వివరించారు. అయితే బిల్ క్లింటన్ ఓ పార్టీలో పాల్గొని అక్కడ రెండు నిమిషాల్లో ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరగా చంద్రబాబు అదరగొట్టారు. ఎంతలా అంటే బిల్ క్లింటన్ రెండు నిషాలను ఏకంగా చంద్రబాబు ప్రజెంటేషన్ కు పడిపోయి 42 నిమిషాలకు పొడిగించారు.

తెలుగు దేశం పార్టీ ఏవైనా మీటింగ్ లు నిర్వహించినా చంద్రబాబు అనుకున్న సమయానికి అక్కడికి చేరుకుంటారు. మిగతా నేతల్లా గంటలు గంటలు ఆలస్యంగా రావడం.. ఏదో కారణం చెప్పడం చంద్రబాబు నాయడు డిక్షనరీలోనే లేదు. అందుకే చంద్రబాబు నాయుడు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు అని అందరూ అనుకుంటారు.

పుస్తకాలు..
*ఒక్కడు
* ఉన్నత రాజకీయాలు- ఉన్నత పాలన
*ప్రజల మధ్య పాతికేళ్లు

గుర్తింపు..

 “అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ సైతం హైదరాబాద్‌ను తన కుమార్తె షెల్షియాతో కలిసి సందర్శించారు. 2000 సంవత్సరం మార్చి 25 వ తేదిన బిల్‌క్లింటన్ యోగక్షేమాలనడుగుతూ లేక వ్రాశారు. ఆ లేఖలో హైదరాబాద్ సంధర్శనానుభవాలను, ముఖ్యమంత్రితో కలిసి ఉన్న క్షణాలను క్లింటన్ గుర్తు చేశారు. ఆయన రాసిన లేఖ పాఠం.”

డియర్ చీఫ్ మినిస్టర్ నాయుడు, “హైదరాబాద్ సందర్శనలో మిమ్మల్ని కలుసుకున్నందుకు, మనం కలిసి మాట్లాడుకునే అవకాశం కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. వసుధైక కుటుంబంలో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత స్థానాం సాధించడానికి భారతదేశాన్ని 21 వ శతాబ్దంలోకి మీరు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను.నేను వెళ్ళే ముందు మీరు నాకు సుందరమైన శిల్పాన్ని తెలుగు వారి సంప్రదాయాక దుస్తులను బహుమతిగా ఇచ్చినందులకు మీకు మరో మారు కృతజ్ఞతలు చెబుతున్నాను. నా భారతదేశ పర్యటనను గుర్తుగా తెచ్చే ప్రత్యేక జ్ఞాపికలని, మీ భావావేశానికి ధన్యవాదాలు. శుభాకాంక్షలతో.....”  బిల్‌క్లింటన్ 


“ఆంధ్రప్రదేశ్ ఆమోదనీయం, కాబట్టి మన లిస్టులో ప్రథమ స్థానంలో చేర్చమని మా వాళ్లకు చెప్పాను”
- బిల్‌గేట్స్, చైర్మన్ అండ్ సి.ఇ. మైక్రోసాప్ట్ కార్పోరేషన్.

చంద్రబాబు నాయుడు ప్రవేశంతో పరిపాలనా విధానంలో వేగం పెరిగినప్పటికీ వ్యవసాయరంగం, సాగునీటి పారుదల వంటి ప్రధాన రంగాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, ఆ రంగాలు నష్టపోయాయని పలువురు విమర్శిస్తుంటారు. చంద్రబాబు నాయుడు పదవీకాలంలోనే వరదలు, కరువు రెండూ సంభవించడంతో వ్యవసాయరంగం భారీగా నష్టపోయింది. 1999వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, 2004, 2009 సంవత్సరాల్లో దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి, సినీ నటుడు చిరంజీవి కారణంగా పార్టీని విజయపథంలో నడిపించలేక పోయారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో.. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కలయికతో పార్టీని గెలిపించి, మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపి ప్రజలు ఎంతో నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. రాజధాని కూడా లేని రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు దిక్సూచిగా నిలుస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఏపి వైపు పెట్టుబడులు చూస్తున్నారన్నా, వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదురుతున్నాయన్నా అది కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవుతోంది. అతనే నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని.. కోట్ల మంది తెలుగు వారి కళ్లలో వెలుగులు నింపాలని మనసార కోరుకుంటోంది తెలుగు విశేష్...


**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  ap  chandrababu naidu  hitech city  janmabhoomi  dwacra  disha  tdp  ttdp  ntr  

Other Articles