Lenders | Ladies | Attcked | Hyderabad | Anantapur

Lenders attacked on ladeis at anatapur and hyderabad

Lenders, Ladies, attacked, hyderabad, anantapur

lenders attacked on ladeis at anatapur and hyderabad. Some ladies lended money from money lenders but they cant pay the amount in time. Lenders who gave money to they attacked crusially.

అప్పు తీర్చలేదని మహిళలపై.. ఛా.. ఇలా చేస్తారా

Posted: 04/21/2015 12:23 PM IST
Lenders attacked on ladeis at anatapur and hyderabad

మహిళలపై దాడులు జరుగుతున్నాయి.. దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలు చూసి చూసి.. చదివి చదివి బోర్ కొట్టింది. అయినా మనుషుల్లో వారి మనస్థత్వాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్, అనంతపురం లలో చోటుచేసుకున్న ఘటనలు చూస్తే మహిళలపై ఇలా దాడులకు దిగుతారా అని ఆలోచిస్తారు. అప్పు తీసుకున్న పాపానికి మహిళలపై మగాళ్లు పశువుల్లా దాడి చేశారు.

అనంతపురం కమలానగర్లో ఆటో డ్రైవర్గా పనిచేసే వెంకట కృష్ణ అనే వ్యక్తి మోమిన్ బేగం వద్ద రూ. 50 వేలు నాలుగేళ్ల క్రితం అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి ఇవ్వలేదు. అడిగినపుడల్లా దాటవేస్తూ వచ్చాడు. ఈ ఉదయం డబ్బులు ఇవ్వాలని నిలదీసిన మోమిన్ బేగంను వెంకటకృష్ణ ఏకంగా కత్తితో పొడిచాడు. మరో ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో జరిగింది.  తీసుకున్న నగదుపై వడ్డీ చెల్లించలేదంటూ వడ్డీ వ్యాపారులు ఓ మహిళపై వైర్ల, రోకలి బండతో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పులు ఇచ్చిన వారు తీర్చడం లేదంటూ కనీసం మహిళలు అన్న ఇంగితం కూడా లేకుండా దాడులకు దిగడం ఎంత మాత్రం మంచిది కాదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lenders  Ladies  attacked  hyderabad  anantapur  

Other Articles