తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు కీలక ములపులు తిరుగుతోంది. అక్రమాస్తులను కలిగి ఉన్నారన్న జయలలిత కేసు తీర్పు ఇవ్వకుండా కర్ణాటక హైకోర్టుపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఇప్పటికే వాదనలు విన్నామని.. కొత్తగా వాదనలు వినాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. గతంలో చేసిన వాదనల ఆధారంగా తుది తీర్పును ఇవ్వొచ్చని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. దీంతోపాటు ఈ కేసు విషయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ను నియమించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని కూడా సుప్రీంకోర్ట్ వెల్లడించింది. ఒకవేళ నియమించినా ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో ఈ కేసుపై తాజాగా వాదనలు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత ఒకరు కోర్టుకు వెళ్లడంతో దానిపై గతంలో నిర్ణయాన్ని ప్రకటించిన కోర్టు తాజాగా తుది నిర్ణయాన్ని వెలువరించింది.
జయలలిత కేసులో చాలా కాలంగా జాప్య జరుగుతూ వస్తోంది. పబ్లిక్ ప్రాజిక్యూటర్ నియామకంపై తమిళనాట పెద్ద వివాదమే చెలరేగింది. అసలు ఈ కేసులో జరుగుతున్న వ్యవహారాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసును మరింత జాప్యం చేయాలని చూస్తున్నట్లుగా ఉందన్న అనుమానం కూడా కోర్టు వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అందిన వెంటనే ఈ కేసులో ముందుకు వెళ్లాలని కూడా సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టుకు చెప్పింది. చట్టంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ అనే వ్యవస్థ సరైనది కాదని కోర్టు ఈ సందర్భంగా తప్పుబట్టింది. మొత్తానికి తమిళనాట, జయలలిత అనుకూల వర్గానికి కాస్త దెబ్బతగిలింది. మరి సుప్రీంకోర్టు తీర్పుతో డిఎంకే నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తారా అన్నది తొందరలోనే తేలుతుంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more