Telanagan | Telugudesamparty | TDP | Revanth Reddy

Telangana tdlp leader reventh reddy posters in ntr trust bhavan crating contravesy in tdp

Telanagan, Telugudesamparty, TDP, Revanth Reddy, Dayakar rao, Ramana, chandrababu naidu

Telangana TDLP leader Reventh reddy posters in NTR Trust bhavan crating contravesy in TDP. Some unknown persons stick posters at NTR trust bhavan that, TDP has to announce Revanth Reddy as Telnagana TDP president.

రేవంత్ రెడ్డి పోస్టర్లు.. టిడిపిలో కలకలం

Posted: 04/27/2015 01:50 PM IST
Telangana tdlp leader reventh reddy posters in ntr trust bhavan crating contravesy in tdp

తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో అంతోకొంతో మాట్లాడే వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి ముందుంటారు. సీనియర్ నాయకుల కన్నా ముందు వరుసతో నిలిచి.. వివాదాలకు ఎప్పుడూ ముందుంటారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి వ్యవహారం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కలవరం కలిగించింది. ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో రేవంత్ రెడ్డి పోస్టర్ల కలకలం రేగింది. తెలంగాణ టీడీపీ యువనాయకుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలంటూ నోటీస్‌బోర్డులో పోస్టర్లను పిన్‌ చేశారు. వచ్చే మహానాడులో రేవంత్‌కు టీటీడీపీ పగ్గాలు అప్పగిస్తున్నట్లు ప్రకటన చేయాలని చంద్రబాబును కోరుతూ తెలుగుయువత పేరుతో పోస్టర్లు వెలిశాయి.
 
దీనిపై తీవ్రంగా స్పందించిన రేవంత్‌ పోస్టర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా స్పష్టం చేశారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావ్, రమణ నాయకత్వంలో పనిచేస్తున్నానని..  వారితో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ బాగుండాలంటే ఇలాంటి పనులు చేయవద్దని కోరారు. ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలో చంద్రబాబుకు అవగాహన ఉందని పేర్కొన్నారు. పోస్టర్లు అంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా ప్రకటించాలని నిజంగా తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారా లేక రేవంత్ రెడ్డి ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagan  Telugudesamparty  TDP  Revanth Reddy  Dayakar rao  Ramana  chandrababu naidu  

Other Articles