RTC | Employees | Fitment | Charges | Hike

Rtc employees demanding to govt for 43percent fitment

RTC, Employees, Fitment, Govt, state, PRC, Charges, Hike

RTC employees demanding to govt for 43percent fitment. The Road transport corporation didnt have sufficient amount so govt pans to hike rtc bus charges.

ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్ మెంట్.. జనాలకు డిసప్పాయింట్ మెంట్?

Posted: 04/28/2015 01:49 PM IST
Rtc employees demanding to govt for 43percent fitment

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా ఉంది ఆర్టీసీ వ్యవహారం. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచే విషయం… ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేలా ఉంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న కారణంతో జీతాలను భారీగా పెంచలేమని ఉద్యోగులకు ఆర్టీసీ స్పష్టం చేస్తోంది. కానీ, ఉద్యోగ సంఘాల ప్రెజర్ తో జీతాలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.  అయితే ఈ భారాన్ని సర్కారే భరించాలని కోరేందుకు ఆర్టీసీ రెడీ అవుతున్నా ప్రభుత్వం ఇందుకు ఓకే చెబుతుందా లేదా అన్నది డౌట్ ఫుల్ గా మారింది. సర్కార్ ఓకే అనగానే చార్జీల పెంపును సీన్ లోకి తెచ్చేందుకు యాజమాన్యం సిద్ధమవుతోంది.

ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినట్టే తమకూ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు అడిగినంతా ఇస్తే.. ఆర్టీసీపై  సంవత్సరానికి 700 కోట్ల రూపాయల భారం పడే చాన్స్ ఉంది. అంత భారం మోయలేమని మేనేజ్ మెంట్ చెప్పడంతో కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ కూడా ఇచ్చాయి. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి పీఆర్సీ ఉంటే ఆర్టీసీలో అది నాలుగేళ్లే. ఈ కారణంతో 43 శాతం కాకుండా 33 శాతం లోపే ఫిట్ మెంట్ ఫైనల్ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇలా అయినా సంస్థపై ఏడాదికి 450 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం బస్ ఛార్జీలను పెంచడానికే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అదేగనక జరిగితే ప్రజల జేబులకు చిల్లుపడటం ఖాయం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Employees  Fitment  Govt  state  PRC  Charges  Hike  

Other Articles