salman khan statement in jodhpur court in the case illegal arms

Salman khan jodhpur court illegal arms case

salman khan, salman khan news, salman khan illegal arms case, sallu illegal arms case, salman khan hit and run case, jodhpur court

salman khan jodhpur court illegal arms case : bollywood actor salman khan given statement in jodhpur court that he has been innocent in illegal arms case and he is not accused.

‘ఆ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు’ : సల్లూభాయ్ ఆవేదన

Posted: 04/29/2015 12:41 PM IST
Salman khan jodhpur court illegal arms case

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై గతంలో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే! ఒకటి హిట్ అండ్ రన్ కేసు కాగా.. మరొకటి అక్రమ ఆయుధాలు ఉపయోగించారంటూ ఈయనపై అభియోగాలు ఎప్పుడో నమోదయ్యాయి. వాటిపై ఇంకా విచారణ సాగుతూనే వుంది. ఇందలో మొదటి కేసు విచారణను కోర్టు మేనెల 6వ తేదీన వాయిదా వేయగా.. రెండో కేసు వ్యవహారంలో తాజాగా సల్లూభాయ్ జోధ్ పూర్ కోర్టుకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఆవేదనను వెల్లడించారు.

బుధవారం ఉదయం అక్రమ ఆయుధాల కేసులో జోధ్ పూర్ కోర్టు ముందు హాజరైన ఆయన.. తనను ఈ కేసులో అనవసరంగా ఇరికించారని విచారణ సందర్భంగా స్టేట్ మెంట్ ఇచ్చాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించిన సల్లూ.. సాక్ష్యాలన్నీ అవాస్తమని పేర్కొన్నాడు. అతని వాదనను విన్న అనంతరం కోర్టు మే 4వ తేదీన విచారణను వాయిదా వేసింది.

ఇదిలావుండగా.. 1998లో ఓ హిందీ సినిమా చిత్రీకరణ నేపథ్యంలో కొందరు నటులతో కలిసి సల్మాన్ జోధ్ పూర్ వెళ్లాడు. అక్కడ జంతువులను వేటాడిన సల్మాన్.. ఆ సమయంలో అక్రమ ఆయుధాలు ఉపయోగించారంటూ ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  jodhpur court  illegal arms case  

Other Articles