Pakistan | Nepal | Earth Quake | Beef

Pakistan serves beef to nepal quake victims

Pakistan, Nepal, Earth Quake, Beef,

Pakistan Government’s relief material containing spiced up beef to the Nepal quake victims has drawn from flack. Nepal, a Hindu-dominated country, values and worships cow and Pakistan’s decision to send beef to has upset the Nepalis.

ఆ.. పాపం చేసిందో లేదో పాకిస్థాన్ కే తెలియాలి..!

Posted: 04/30/2015 04:38 PM IST
Pakistan serves beef to nepal quake victims

నేపాల్ లో సంభవించిన భూకంపానికి అన్ని దేశాలు స్పందిస్తున్నాయి. తమవంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. అయితే మన దాయాది దేశం పాకిస్థాన్ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. అసలే భారీ భూకంపం సంభవించి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేపాల్ ఉండగా అత్యధికంగా హిందువుల జనాభా ఉన్న ఆ దేశానికి పాక్ సాయంపేరిట భారీ మొత్తంలో మసాల దట్టించిన మాంసాహారాన్ని పంపించి వార్తల్లో నిలిచింది. దీనిపై చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు ది డెయిలీ మెయిల్ వెల్లడించింది. హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న నేపాల్లో గోవులను పవిత్రమైనవిగా భావిస్తారు. గోవధను కొన్ని మత సంఘాలు ఒప్పుకోవు కూడా. రిపబ్లిక్ రాజ్యంగా అవతరించే వరకు కూడా ప్రపంచంలో ఏకైక హిందు దేశం కూడా అదే.

అలాంటిది ప్రస్తుతం పాక్ చేసిన ఈ చర్య కారణంగా సార్క్ దేశాలమధ్య ఓ చర్చకు తావిచ్చి వివాదం నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వైద్య సేవలు అందించేందుకు వెళ్లి ప్రస్తుతం బిర్ అనే ఆస్పత్రిలో నేపాల్ వారికి చికిత్స చేస్తున్న భారతీయ వైద్యులు ఈ విషయంపై మాట్లాడుతూ మంగళవారం పాక్ పంపించిన ఆహార పదార్థాల్లో బీఫ్ మసాల ప్యాకెట్లు ఉన్నాయని చెప్పారు. వాటిని తాము ముట్టుకోలేదని, ప్రారంభంలో అది తెలియని స్థానికులు తీసుకున్నా తర్వాత తెలుసుకొని పక్కన పడేశారని చెప్పారు. కాగా, ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే అంతగా చర్చించకపోయినప్పటికీ తర్వాత జరిగే ద్వైపాక్షిక చర్చల సమయంలో నేపాల్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Nepal  Earth Quake  Beef  

Other Articles