మేడే.. అంటే గుర్తుకువచ్చేది.. పెట్టుబడిదారుల బాసిన శృంఖాలాలను తెంచుకునేందుకు ప్రపంచ కార్మికలోకం జరిపిన మహాసంగ్రామం. మే డే అంటే కార్మిక విప్లవ దినోత్సవమే. పెట్టుబడిదారులు క్రూర చేష్టలు, శ్రమ దోపిడికీ వ్యతిరేకంగా కార్మికలలో పెరిగిన అసహనం.. రూపాంతరం చెంది.. ఉద్యమంగా మారింది. ఆ పిమ్మట విప్లవోద్యమంగా మలుచుకుంది. ప్రపంచ కార్మికులందరూ ఓక్కటని చాటుతూ.. జరిగిన విరోచిత పోరాటంలో ఎందరెందరో కార్మికులు అమరులయ్యారు. వారి త్యాగాల ఫలితమే కార్మికుల లోకానికి కోత్త వెలుగులు సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోమారు వచ్చిన మేడే కార్మిక దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్త కార్మికులందరూ ఘనంగా జరుపుకున్నారు. పలు దేశాలలో కార్మికులు భారీగా ర్యాలీలను నిర్వహించి.. పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మన దేశంలో అనేక పారిశ్రామిక వాడల్లో అరుణమయం అయ్యింది. పలు చోట్ల కార్మికులు ఆనందంగా ఆటల పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతులు అందజేశారు.
8 గంటల పని కోసం జరిగిన మహత్తర పోరాటం అని అందరికీ తెలుసు. గతంలో కరెంట్, ఆవిరి యంత్రాలను కనుగొన్న తర్వాత యజమానులు కార్మికులతో 16 గంటలు పనిచేయించుకునేవారు. ఎనిమిది పని గంటల కోసం చికాగోలో కార్మిక లోకం జరిపిన వీరోచితం పోరాటం సాగింది. ఫలితం ప్రపంచ వ్యాప్తంగా 8 గంటల పని అమలులోకి వచ్చింది. అదే మేడే. ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు హక్కులు కూడా అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వాలే కార్మకుల కోసం ప్రత్యేకంగా లేబర్ శాఖలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. దీనికి తోడు ప్రతీ పరిశ్రమలో కార్మిక సంఘాలు పుట్టుకోచ్చాయి. వాటితో అధికారిక కార్మిక సంఘంతో నిర్ణయాలను తీసుకున్న తరువాతే యాజమాన్యాలు వాటి విధానాలను అమలు పరుస్తున్నాయి.
అయితే యాంత్రీకరణ పెరిగినకొద్దీ కార్మికుని పనిగంటలు తగ్గాలన్న నిభంధనకు ఇప్పుడు తూట్లు పోడుస్తున్నాయి యాజమాన్యాలు. అన్ని రంగాలలో యాంత్రీకరణ పెరిగిపోయింది. యాంత్రీకరణ లేనిదే యాజమాన్యాలు ఏమీ చేయలేని పరిస్థితికి జారుకున్నాయి. అయినా.. పనిగంటలను తగ్గించాలన్న నిబంధనను ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. బడా పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి పుట్టుకోచ్చిన యాజామాన్యాలకు తలోగ్గి, నిబంధనలను యధాతధంగా కోనసాగిస్తున్నారు. కార్మికుల పని విషయంలో నిజానికి మన ప్రభుత్వాలు బ్రిటిష్ కాలంనాటి చట్టాలను మెరుగు పరచాలి. కానీ వాటిని తిరగదోడి యాజమానులకు అనుకూలంగా మార్చాలని చూడటం అనాగరికం.
ప్రస్తుతం శారీరిక శ్రమ అధికంగా వుంటే ఉత్పాదక రంగ పరిశ్రమలతో పాటు మానిసిక శ్రమ అత్యధికంగా వుండే సేవా రంగాలు ( కంప్యూటర్, ఐటీ, కాల్ సెంటర్, టెలీ మార్కెటింగ్ తదితర ) పుంజుకున్నాయి. ఎక్కడ చూసిన, ఏ ప్రాంతంలో చూసినా.. సేవా రంగ పరిశ్రమలు ఉద్భవిస్తున్నాయి. అయితే ఇందులో పనిచేసే ఉద్యోగులకు కూడా పాత చట్టాలనే వర్తింపజేస్తున్నారు. శ్రమతో కూడిన పనిని, మానసిక శ్రమను ఒకే గాడిన కట్టి యాజమాన్యాలు ముందుకు సాగుతున్నాయి. అయితే మానసిక శ్రమజీవులకు ఓత్తిడి అధికంగా వున్న కారణంగా వారికి చట్టబద్దంగా రావాల్సిన ఐదు రోజుల పనిదినాలు, ఇద్యాది బెనిఫిట్ లను కూడా యాజమాన్యాలు కాలగర్భంలో కలిస్తుండగా, వాటికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. కార్మిక చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తున్న జర్మనీ, ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో నాలుగు రోజుల పనిదినాలు కూడా అమల్లో వున్నాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాల్సి అవసరం వున్న అక్కడి ప్రభుత్వాలు వాటిని అమలు పర్చడం లేదు.
పరిశ్రమ సంపసద్వంతంగా వున్నప్పుడు యజమానులు పెద్దగా లాభాలు పోగేసుకుంటారు. ఆ లాభాలను కార్మికులకు పంచాలని చూడరు. సంక్షోభం ఉత్పన్నమైనప్పుడు యజమానులు నష్టాలను మాత్రం కార్మికులపై నెట్టివేస్తారని లెనిన్ ఏనాడో సెలవిచ్చాడు. ఇవాళ అక్షరాలా అమలు జరుగుతున్నది. అమెరికా, గ్రీస్ తదితర దేశాల్లోని కార్పొరేట్ శక్తుల అప్పులు ప్రభుత్వం అప్పులుగా మారి దేశాలు దివాళా స్థితికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో గల ఎ.పి రేయన్స్ బిల్టు పరిశ్రమ తన సంక్షోభ భారాల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరడం తాజా ఉదాహరణ. యజమానులు అడిగిందే తడవుగా ఫ్యాక్టరీ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం కాంట్రాక్టు లేబర్ (రెగ్యులేషన్ అండ్ అబాలిషన్) చట్టం, వేతన సవరణ సంబంధించిన చట్టాలను మారుస్తున్నారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత, కార్మిక హక్కులు, జీతాలు, జీవనభృతిపై దాడి జరుగుతున్నది. పెట్టుబడి లాభాలను సొంతం చేసుకొని నష్టాలను సమాజపరం చేస్తున్నది. చట్టం ముందు యజమానులూ కార్మికులూ సమానమే. కానీ వీరి సంబంధాలు ఎప్పుడూ సమానం కాదు. వాస్తవానికి యజమాని ఉత్తర్వులిచ్చి పనిచేయిస్తాడు. కార్మికుడు పనిలో పరిస్థితిని మార్చలేడు. దీన్ని మేడే స్ఫూర్తితో తిరగ రాయాల్సిన కర్తవ్యం కార్మికవర్గంపై వుంది.
కేంద్రంలో నూతనంగా కోలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వం కూడా ఒకవైపు బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరించటానికి, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి భూసేకరణ బిల్లు (ఆర్డినెన్స్) తీసుకొచ్చి రైతుల హక్కులను పణంగా పెట్టి కార్పొరేట్లకు పట్టం కడుతున్నది. దేశ ఆర్థిక వనరులను తన ఇష్టనుసారంగా లూటీ చేయడానికి ఏ అడ్డంకులూ లేకుండా చేస్తున్నది. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తున్నది. దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం చాలా వుంది. ఈ నేపథ్యంలో దేశంలోని కార్మికవర్గం, కార్మిక సంఘాలు సామ్రజ్యవాద వ్యతిరేక స్పృహను, అంతర్జాతీయ సంఘీభావ చైతన్యాన్నీ కలిగి వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది
జి మనోహర్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more