WHO | Alchohol | Health | Death,

World heath organisation latest report clear that 6pecent of the pople died with alchohol

WHO, Alchohol, Wine, Health, Death,

World heath Organisation latest report clear that 6pecent of the pople died with alchohol. Alchohol cunsuption causes seviour health problems.

మందు బాబులకు ముఖ్య గమనిక.. WHO వారి హెచ్చరిక కూడా..!

Posted: 05/01/2015 04:47 PM IST
World heath organisation latest report clear that 6pecent of the pople died with alchohol

కాస్త హ్యాపిగా అనిపించినా లేదా బాధ అనిపించినా మందు బాటిల్ చేతిలోకి రావాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితిలో తాగకుండా ఉంటే అదో వింత అన్నట్లు తయారవుతున్నారు జనం. అయితే అసలు మందుకు అలవాటు పడకండి బాబూ.. మీ ఆరోగ్యానకి మంచిది కాదు అని ఎంత మంది అన్నా.. ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని మందు బాటిల్ల మీద రాసినా.. చివరకు సినిమా థియేటర్ లో యాడ్ వేసి చూపించినా మందు అలవాటును మాత్రం చాలా మంది మానడం లేదు. అయితే కొన్ని సర్వేలు మాత్రం డెయిలీ తక్కువ మోతాదులో ఆల్కాహాల్ తీసుకుంటే మంచిదేనని చెప్పాయి. అది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని చెప్పుకొచ్చాయి. పాత సర్వేలు ఎలా చెబుతున్నా.. ద ఇంటర్నేషనల్ లివర్ కాంగ్రెస్-2015 చేసిన రీసెంట్ సర్వేలో.. అసలు ఆల్కాహాల్ అనేదే ఆరోగ్యానికి మంచిదికాదని తేల్చేసింది. తక్కువ తాగినా.. ఎక్కువ తాగినా.. ఎఫెక్ట్ ఒకేలా ఉంటుందని స్పష్టం చేసింది. తక్కువ తాగే వాళ్లే 11.13 శాతం మంది… హెవీ డ్రింకర్స్ గా మారుతున్నారని చెబుతోంది.

అంతేకాదు.. వాల్డ్ వైడ్ గా చనిపోతున్న వాళ్లలో మందుబాబులే ఎక్కువగా ఉన్నారట. వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేటస్ రిపోర్టు ప్రకారం… ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్న వాళ్లలో 6శాతం మంది ఆల్కాహాల్ తాగేవాళ్లున్నారు. ఇందులో లాంగ్ టర్మ్ లివర్ డ్యామేజ్ తో చనిపోతున్న వాళ్లే ఎక్కువ. మొత్తం 193 దేశాల్లో సర్వే చేసిన WHO ఈ వాస్తవాలను బయటపెట్టింది. లాంగ్ టర్మ్ లివర్ డ్యామేజ్ అనేది డెయిలీ మందేస్తే వచ్చే బోనస్ రోగం. ఇది స్లో పాయిజన్ లా… హెల్త్ పై ఎటాక్ చేస్తుంది. ఇక.. రోజూ పీకల దాకా మందేసే వాళ్లకు ఎలాగో… చాలా త్వరగానే లివర్ పాడైపోయిద్దని సర్వే రిపోర్టు చెబుతున్న మాట. ఆల్కాహాల్ అంటే.. అనారోగ్యమే. అది తక్కువ తాగినా.. ఎక్కువ తాగినా.. మందు మందే కదా. రోజుకు ఒకటి రెండు పెగ్గులే కదా. ఏం కాదనుకోని తాగేస్తే పొరపాటే. అది కూడా మన హెల్త్ ను డెంజర్ జోన్ లోకి తీసుకెళ్తుంది. సో.. బీ కేర్ ఫుల్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WHO  Alchohol  Wine  Health  Death  

Other Articles