ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మళ్లీ మాట మార్చారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం వుందని, ఇప్పుడున్న పరిస్థితులతో అది సాధ్యం కాదని గతంలో తేల్చిచెప్పిన వెంకయ్య.. ఆ తరవాత మరో అడుగు ముందుకేసి.. తనకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో ఎలాంటి సంబంధం లేదని, తాను కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఇటీవల గుంటూరులో ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి 36 గంటల పాటు ఆందోళన చేయగా, ఎట్టకేలకు పోలీసులు అతన్ని కిందకు దింపడం.. అది చాలదన్నట్లు.. బీజేపి నేత, నటుడు శివాజీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తూ.. గత ఐదు రోజులుగా నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా కల్పనతో రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తాయని.. వాటితో అటు అభివృద్దితో పాటు ఇటు నిరుద్యోగ సమస్య తీరుతుందని శివాజీ పేర్కోన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. శివాజీని అస్పత్రిలో చేర్చడంతో.. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ కూడా ఈ అంశంపై డిమాండ్ చేస్తూ గుంటూరులో ధర్నా చేపట్టింది.
దీంతో మరోమారు రంగంలోకి దిగిన కేంద్రమంత్రి వెంకయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ఎంతో కీలకమైనదని దాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. అంతేకాదండీ ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకు ఉందని కానీ... పార్టీలకు కాదని పేర్కొన్నారు. యూపీఏ సర్కార్ ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తున్నామని వెంకయ్య తెలిపారు. ఏపీ ఆర్థికలోటుపై ఆర్థిక, హోంశాఖలు చర్చిస్తున్నాయని చెప్పారు. హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more