Red Sandal Smuggling: Heroine Neetu Agarwal says she is clean

Neetu agarwal says she is not involved in red sander smuggling

Tollywood actress Neetu agarwal arrested, actress Neetu Agarwal got bail, Actress tollywood news, tollywood actress Neetu Agarwal, Tollywood actress Neetu Agarwal arrested, actress, actress neetu agarwal, hyderabad, redwood sandal case, smaglar mastanvali, ap, kurnool police, neetu agarwak with media, neetu agarwal says she is clean, mastan vali, red sandal smugglers encounter,

Tollywood actress Neetu Agarwal, who was arrested last month on the charge of aiding red sanders smugglers, talks with media today and says she is clean after gettint bail on Tuesday.

ఏ పాపం తెలియకున్నా.. నిందితురాలిని చేశారు.. నీతూ

Posted: 05/07/2015 03:13 PM IST
Neetu agarwal says she is not involved in red sander smuggling

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో అభియోగాలు ఎదుర్కోని అరెస్టు అయిన నటి నీతు అగర్వాల్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఈ కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చిన నీతు అగర్వాల్.. గురువారం కర్నూలులో  మీడియాతో మాట్లాడారు. మస్తాన్ వలీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటానని నీతూ అగర్వాల్ అన్నారు. మస్తాన్ వలీ తనకు ఒక రియాల్టర్, నిర్మాతగానే తనకు తెలుసునని ఆమె తెలిపారు. అంతకు మించి అతడి గురించి తనకేమీ తెలియదన్నారు.

ఇద్దరం కలసి ప్రేమ ప్రయాణం చిత్రంలో కలిసి నటించామని... ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకున్నామని వెల్లడించారు. అయితే అతను ఎక్కడి నుంచి వచ్చాడు... సినీ రంగానికి ఎలా వచ్చాడు... అనే అంశాలపై మస్తాన్ వలీని  తాను ఏ రోజు ప్రశ్నించలేదన్నారు. ఇంతకు మించి తనకు మస్తాన్ గురించి ఏమీ తెలియదన్నారు. గతంతో తాను మస్తాన్ పై చేసిన అరోపణలన్నింటికీ కట్టుబడి వున్నట్లు చెప్పారు. మస్తాన్ వలి తనను మానసికంగా, శారీరికంగా హింసించాడని చెప్పారు. తన ఏటీఎమ్ కార్డు కావాలని ఓ భర్తగా మస్తాన్ అడిగాడని.. భార్యగా తాను ఇచ్చానని ఆమె చెప్పారు. తన ఏటీఎం కార్డును మస్తాన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆరోపిస్తున్నట్లు తాను ఎవరిని మోసం చేయలేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని... భవిష్యత్తులో తప్పకుండా సినిమా అవకాశాలు వస్తాయని నీతూ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసుతో నటి నీతూ అగర్వాల్ కు ఎలాంటి సంబంధం లేకున్నా.. కావాలని అమెను ఇరికించి.. ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ తో ఇంటాబయటా విమర్శల పాలవుతున్న పోలీసులు.. ఈ ఘటనతో విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారన్న అనుమానాలు కూడా పలువురిలో వ్యక్తమవుతున్నాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neetu Agarwal  Tollywood  Actress  media  

Other Articles