massive crowd throng for free meal add

Massive queues reported for free meal add

massive queues for free meal add, massive crowd throng for free meal add, two Kms long queues, free meal at Dunkin Donuts, hyderabad, banjara hills, rich kids queue for free meal, banjara hills police, Traffic in hyderabad, hyderabad rich kids

massive crowd throng for two kilometers long, to have free meal at Dunkin' Donuts,

వారేవ్వా..! నగరంలో ‘బడా’ బోజనప్రియులు క్యూ కట్టారు

Posted: 05/09/2015 03:08 PM IST
Massive queues reported for free meal add

పుణ్యక్షేత్రాల వద్ద అన్నసమారాదణలు చేయించినా.. లేక అన్నసమారాధనను ఆరగించిన పుణ్యం, పురషార్థం కలసి వస్తాయంటుంటారు పెద్దలు. అన్నసమారాధన కోసం క్యూలలో నిలబడి మరి బుజిస్తారు. వాళ్లు ఆచరించడంతో పాటు పిల్లలకు కూడా దీనిని అలవాటుగా మారుస్తారు. కాస్తా డబ్బున్నవాళ్లు మాత్రం అక్కడ అంత సేపు క్యూ కట్టడం దేనికి.. అనుకుని ఏదో హోటల్ లో కానిచేస్తుంటారు. అయితే ఇప్పుడు మహానగరాలలో కోత్త ఒరవడి ప్రారంభమైంది. నూతనంగా తెరుచుకునే హోటళ్లు, బడా కన్ఫెక్షనరీలు తమ నూతన శాఖలో ముందుగా వచ్చే వారికి ఫ్రీగా సర్వ్ చేస్తామని ప్రకటించేస్తూ.. కస్టమర్లను అట్రాక్ట్ చే్స్తున్నారు.

 ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా లాంగిచేయడం మనకు తెలిసినంతగా ఇంకెవరీ తెలియదు. అదేంటి అంతమాట అన్నారు. అంటారా..? మిమల్ని కాదులేండి.. ఈ సంఘటన వివరాలు చదివితే మీరు అలానే అంటారు.. ఉచితంగా లభించే భోజనాన్ని లాగించడానికి ఇంత మంది బోజనప్రియులు సిద్దంగా వుంటారని మా ఉద్దేశ్యం. నగరంలోని తమ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి 300 మందికి ఫ్రీగా సర్వ్ చేస్తామని ప్రకటనను చూసి.. ఆ హోటల్ లో ఉచితంగా బోజనం లాగించడానికి ఎంత మంది వచ్చరనుకుంటున్నారు..? సుమారు రెండు కిలోమీరట్ల వరకూ క్యూ ఏర్పడేంత మంది. నిజమేనా అంటూ సందేహిస్తున్నారా..?

అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు బోజనప్రియులు ఇంతలా ఎగబడ్డారు. నగరంలో ఈ సంఘటన ఎక్కడా చోటుచేసుకుందని అనుకుంటున్నారా? అది కూడా పాష్ ఏరియాగా ప్రసిద్ది చెందిన బంజారా హిల్స్ రోడ్డు నెంబరు 1 లో. ఇవాళ నూతనంగా నగరంలోని బంజారా హిల్స్ లో. 'డంకిన్ డోనట్స్' తమ శాఖను తెరిచింది. ఏదో ఆపర్ పెడితే కానీ పలువురికి తమ దుకాణం గురించి తెలియదని, ప్రచారం జరగాలన్న ఉద్దేశ్యంతో ఒక ఆఫర్ ను తీసుకువచ్చింది. మొదటి 300 మందికి ఉచితంగా ఫుడ్ సర్వ్ చేస్తామని యాజమాన్యం ప్రకటించింది.

దీంతో చిన్నా, పెద్దా, ఆడ, మగా ఒక్కరేమిటీ.. సుమారుగా రెండు కిలోమీటర్ల మేర బోజనప్రియులు క్యూ కట్టేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. టిపిన్ కూడా చేయకుండానే తెల్లవారు 5 గంటల నుంచే దుకాణం ముందు బోజన ప్రియులు క్యూ కట్టారు. కాదు కాదు పడిగాపులు పడుతున్నారు. చాంతాడంత క్యూ ఏర్పడటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా డ్యూటీలోకి దిగారు. కొసమెరుపు ఏంటంటే... ఈ క్యూలో బడాబాబులే ఎక్కువగా ఉండటం విశేషం.. అదీగాక వారు వచ్చిన కార్లు, ఇతర ఖరీదైన వాహనాలతో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి మరి..
.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Queues  free meal  Dunkin' Donuts  banjara hills  

Other Articles