pig | blood | marriage | Mp

Pig blood in the marriage getting viral in the news

pig, blood, marriage, madhyapradesh, Tribals

It’s long past sundown in Kutela village. A bride and a groom from Kushram clan of Gond tribe are midway through the traditional seven rounds around the fire. The groom is dressed in check shirt, pants and wears a pair of aviator sunglasses. The bride is in blood-red sari. Suddenly, a pig, chased by a man from the groom’s side, darts through the assembly. Growling and acting like a tiger, he corners it, clubs it repeatedly with a stick, successfully pins it down and sinks his teeth into the pig to suck the animal’s blood. The guests look on happily.

పెళ్లి కావాలంటే పంది రక్తం కావాల్సిందే..

Posted: 05/09/2015 03:40 PM IST
Pig blood in the marriage getting viral in the news

పంది.. అనగానే చాలా మందికి అసహ్యం కలుగుతుంది. కొన్ని మతాల్లో అయితే పంది గురించి మాట్లాడితేనే అర కిలోమీటర్ పారిపోతారు. అయితే పంది మాంసం, వెంట్రుకలు, చర్మంలతో కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తోంది. సరే బిజినెస్ సంగతి పక్కన బెడితే కొంత మంది పంది మాంసాన్ని తింటారు. దాంట్లో శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు ఉన్నాయని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అయితే ఓ గిరిజన తెగలో పెళ్లి జరగాలంటే ఈ పందితో ముడిపడి ఉంటుంది. అవును పందికి, పెళ్లికి ఆ జాతిలో చాలా సంబందం ఉంటుంది. పంది రక్తాన్ని రుచి చూడకుండా ఆ గిరిజన తెగలో పెళ్లి జరగదు అంటే పరిస్థి ఎలా ఉంటుందొ అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ పంది గొడవేంటో, ఆ పెళ్లేంటో.. తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

గోండు జాతికి చెందిన కుష్రమ్ తెగ మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో విస్తరించింది. మధ్యప్రదేశ్ లోని అమర్ కంటక్ అడవిలో ఎక్కువ గా ఈ తెగ నివసిస్తుందట. అక్కడే ఓ విచిత్రమైన ఆచారం ఉందట వీళ్లకు. అక్కడ ఎవరికైనా పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు తరుపు వారు ఎవరైనా ఒకరు పులి లా మారిపోవాలట. పులి లా మారిపోయి ఏంచేస్తారంటారా? పులి లాగ మారి ఆ అడవిలో ఉన్న పందిని వేటాడి దాని రక్తాన్ని రుచిచూడాలట. అలా రుచి చూస్తేనే భవిష్యత్తులో పెళ్లి జరిగే జంట ఎటువంటి జంతువుల దాడికి గురికాకుండా ఉంటుందట. ఆ అడవి చుట్టూ ఉండే దిండోరి, అనోపూర్, మండాలా జిల్లాల్లో ఉండే కుష్రమ్ జాతి వాళ్లు పందిని బలి ఇవ్వందే ఎవరి పెళ్లీ చేయరట. వాళ్లు పులిని తమ దేవుడిగా, రక్షకుడిగా పూజిస్తారట. అందుకే పులిలా మారి పంది రక్తం తాగి దాన్ని వాళ్ల కులదేవుడైన పులికి బలిస్తారట. అయినా ఒక్కో గిరిజన తెగ వారు ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తారు. అయితే మనకు ఎలా ఉన్నా వారికి మాత్రం అనాదిగా పంది రక్తం సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
(Source: Hindustantimes)


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pig  blood  marriage  madhyapradesh  Tribals  

Other Articles