toilet saved a marriage in West Bengal | Rinku | Jaygobinda Mondal | divorce

Toilet saved a marriage in west bengal

toilet saved a marriage in West Bengal, Toilet, Rinku, Jaygobinda Mondal, Majdia, Toilets for All, toilet, Marriage, divorce, husband wife, domestic harrasment, kolkatta high court, toilet brings happy ending for couple, marital dispute, violent under the influence of liquor, Majdia Village, Nadia District

It took a toilet to bring about the happy ending for a couple whose marriage was rocked by vexing suspicion and mistrust, all because the woman was forced to go outdoors to relieve herself.

ఔరా..! విడిపోతున్న దంపతులను అలా ఒక్కటి చేసింది

Posted: 05/11/2015 10:37 AM IST
Toilet saved a marriage in west bengal

దాంపత్య జీవీతం అన్నాక చిన్న చిన్న పొరపచ్చాలు, అనుమానాలు, సందేహాలు, చిన్న గోడవలు రావడం సహజం. ఇవి సంపన్న కుటుంబాల నుంచి సామాన్యుడి వరకు అందరి జీవితాలలో భాగం. అయితే తప్పును గ్రహించి పొరబాట్లను చక్కదిద్దుకుని వెళ్లగలిగే వాళ్లే బుద్దిమంతులు. వారి దాంపత్య జీవనానికి 60 ఏళ్ల వసంతంగా వచ్చే షష్టిపూర్తిని చేసుకుని.. మనమరాల్లు, మునిమనవలతో జీవించి బతుకుకు బంగారు బాట వేసుకోగలుగుతారు. అలా కాని పక్షంలో కోర్టు, విడాలకులు, పోలిస్ స్టేషన్లు.. అందరూ వున్నా.. ఏదో తెలియని ఒంటరి తనం, నిరాశ, నిసృహ, మనోవేధన, అన్ని కలగలపి అక్రోశంతో ఎదుటివారిని అన్ని విషయాల్లో తప్పబడుతూ.. తమను తాము అనారోగ్యానికి దెగ్గరగా చేసుకుంటారు.

ఇక్కడ కూడా ఓ దంపతుల మధ్య పోరపచ్చాలు వచ్చాయి. చిన్న పాటి అనుమానం వారిట్లో పెనుభూతంగా మారింది. భర్త తాగివచ్చి భార్యను వేధించడం వరకు వెళ్లింది. నాకేం తెలియదు మొర్రో అని నెత్తి,నోరు బాదుకున్నా.. మధ్యం మత్తులో వున్న ఆ భర్త వినిపించుకునే వాడు కాదు. పోలిస్ స్టేషన్లు, కోర్టులు, పెద్దమనుషుల పంచాయితీ.. చివరకు విడాకుల వరకు దారితీసింది. అయితే అసులు కారణం తెలుసుకున్నాక.. ఔరా..! అనుకుంటూ సంతోషంగా వున్నారు. ఇంతకీ అదేంటనేగా మీ సందేహం. అదేనండి మరుగుదోడ్డి.. టాయ్ లెట్

నమ్మశక్యం కావడం లేదా..? వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లా మాజ్దియా గ్రామానికి చెందిన దినకూలీ జయగోబింద మండల్‌కు రింకుతో 2001లో పెళ్లయింది. రెండేళ్ల కిందట కాపురంలో కలతలు తలెత్తాయి. బహిర్భూమికి వె ళ్తున్న భార్య గంటల కొద్దీ అక్కడే ఉంటోందని, ఆమెకు ఎవరితోనో సంబంధముందని మండల్ అనుమానించసాగాడు. అలా సందేహం వచ్చిందో లేదో.. అమె రోజుకు రెండు సార్లు.. పలు సందర్భాల్లో మూడు సార్లు వెళ్లడంతో అనుమానం పెనుబూతమైంది. అమెను ప్రశ్నించసాగాడు.

అలాంటిదేమీ లేదు మొర్రో అని భార్య రింకు మొత్తుకుంది. భర్త వినకుండా తాగొచ్చి ఆమెను కొట్టడం మొదలెట్టాడు. రింకు పుట్టింటికెళ్లి కోల్‌కతా హైకోర్టులో భర్తపై గృహహింస కేసు పెట్టింది. అయితే మరుగుదొడ్డి లేకపోవడంతో తమ మధ్య గొడవలకు కారణమని దంపతులు తెలుసుకున్నారు. 'అందరి మరుగుదొడ్లు' పథకం కింద తమ ఇంటి ఆవరణలో ఉచింతగా టాయలెట్ కట్టించుకున్నారు. కాపురం నిలబడింది. ''బహిర్బూమికి వెళ్లినప్పడు సురక్షితమైన, మరుగుండే స్థలం కోసం వెతికే దాన్ని. దీంతో కాస్త ఆలస్యమయ్యేది. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. టాయిలెట్ వచ్చాక సంతోషంగా ఉన్నాం'' అని రింకూ నవ్వుతూ చెప్పింది. నాడియా జిల్లాలో లక్షలాది టాయిటెట్లు కట్టించిన అధికారులు జిల్లాను 'బహిరంగ మలవిసర్జన' లేని జిల్లాగా ప్రకటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Toilets for All  toilet  Marriage  divorce  husband wife  

Other Articles