Jayalalithaa acquitted by Karnataka high court in 18-yr-old DA case

Karnataka high court acquitts jayalalithaa in da case

Karnataka High Court acquitts Jayalalithaa, Jayalalithaa acquitted by Karnataka high court, Jayalalitha, former Tamil Nadu chief minister J Jayalalithaa, Tamil Nadu, Karnataka, Section 144, High Court. Disproportionate assets case, Code of Criminal Procedure, Tight security arrangements, Karnataka High Court, karnataka high court judgement, karnataka high court verdict

The Karnataka high court on Monday acquitted former Tamil Nadu +chief minister and AIADMK supremo J Jayalalithaa in the disproportionate assets case.

జయలలితను నిర్దోషిగా తేల్చిన కర్ణాటక హైకోర్టు

Posted: 05/11/2015 12:13 PM IST
Karnataka high court acquitts jayalalithaa in da case

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరపణా అగ్రహరా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను రాష్ట్రోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 18 ఏళ్లుగా కోనసాగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు జయలలితకు స్వేచ్ఛ లభించింది. పరప్పనా అగ్రహార ప్రత్యేక న్యాయస్థానం విధించిన 100 కోట్ల రూపాయల జరిమానా.. నాలుగేళ్ల జైలు శిక్షను కూడా హైకోర్టు రద్దు చేసింది

అక్రమాస్థుల కేసులో జయలలితతో పాటు ఉన్న అమె బాల్య స్నేహితురాలు శశికళ సహా అమె భర్త సుధాకరన్, ఇళవరసిలను కూడా న్యాయస్థానం నిర్దోషులుగా విడిచిపెట్టింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. అభిమానులు ప్రత్యేక పూజలు ఫలించాయి. అమె మళ్లీ తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల ఆశలు ఫలించాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. చెన్నైలోని అనేక వీదుల్లో అభిమానులు స్వీట్లు పంచిపెడుతున్నారు.

జయలలిత తరఫు న్యాయవాది బీ కుమార్ మాట్లాడుతూ... ఇప్పుడు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పు పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు. కాగా, జయలలితకు అనుకూలంగా వచ్చిన తీర్పు పైన సుబ్రహ్మణ్య స్వామి, కర్నాటక ప్రభుత్వం, డీఎంకే నేత అంబజ్ గన్‌లు సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశముంది.

హైకోర్టు తీర్పులో కీలకాంశాలు
* జయలలిత అక్రమాస్తులు సంపాదించినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది.
* జయలలిత, ఇతర నిందితులు తాము ఎలా సంపాదించామనే వివరాలు వెల్లడించారు
* నిందితుల సంపాదన వివరాలకు సంబంధిచిన ఆధారాలు సంతృప్తికరం
* అక్రమాస్తులు ఎలా సంపాదించారనే దాని పైన ప్రాసిక్యూషన్ వివరాలు సంతృప్తికరంగా లేవు.

జి. మనోహర్

 

17న సీఎంగా జయ ప్రమాణం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  karnataka high court  judgement  

Other Articles