Kerala woman minister PK Jayalakshmi marries farmer

Kerala woman minister gets married to a farmer

Woman Minister gets Married to a Farmer, kerala minister PK Jayalakshmi, PK Jayalakshmi, Mambayil near Valadu, Waynad, Kerala Chief Minister Oommen Chandy, Opposition Leader VS Achuthanandan, minister PK Jayalakshmi wedding ceremony, kerala Welfare of Scheduled Tribes and Youth Affairs minister, Mananthavady constituency, congress, UDF

To everyone's surprise, PK Jayalakshmi who is Kerala's only woman minister in the Congress-led UDF Government on Sunday tied the knot with a farmer in a traditional Hindu tribal ritual.

ITEMVIDEOS: రైతును పరిణయమాడిన కేరళ మంత్రి

Posted: 05/11/2015 01:29 PM IST
Kerala woman minister gets married to a farmer

కేరళ ప్రభుత్వంలో వున్న ఏకైక మహిళా అమాత్యురాలు.. అసాధ్యమనుకున్నదానిని సుసాధ్యం చేసి.. నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఒక స్థాయికి చేరకోగానే కింది స్థాయిని మరచి.. తమ స్థాయికి తగ్గ వ్యక్తులతోనే స్నేహాన్ని చేస్తున్న ఈ రోజుల్లో తాను ఏ స్థాయికి చేరినా.. కింది స్థాయి నుంచే వచ్చానని రుజువు చేశారు కేరళలోని కాంగ్రెస్ సభ్యురాలు, ఏకైక గిరిజన మంత్రి పి.కె. జయలక్ష్మి. అమె తన చిన్ననాటి స్నేహితుడు, సమీప బంధువు, రైతు అయిన సి.ఎ. అనిల్కుమార్ను పరిణయమాడారు. సంప్రదాయ కురిచియ గిరిజన పద్ధతిలోనే ఆమె పెళ్లి చేసుకున్నారు.

మంత్రి వివాహానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ప్రతిపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్, కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు.. అందరూ కొత్త జంటను అభినందనలలో ముంచెత్తారు. కళ్యాణమండపంలోకి వెళ్లడానికి ముందుగా జయలక్ష్మి ముఖ్యమంత్రి చాందీ, అచ్యుతానందన్ల పాదాలకు నమస్కరించారు. అయితే.. తమ సంప్రదాయం ప్రకారం ఏమీ మాట్లడకూడదు కాబట్టి.. పెళ్లి అయ్యవరకు ఆమె మౌనంగానే ఉండిపోయారు. కేరళ గిరిజన సంక్షేమ, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న జయలక్ష్మి.. కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలు. గిరిజన తెగలలో ఆమె తెగను బ్రాహ్మణులుగా పరిగణిస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala  minister  farmer  Congress  UDF  

Other Articles