Delhi traffic cop flings brick at woman for not paying bribe, arrested

Delhi traffic cop hits woman with bricks suspended

delhi shocking incident, national capital Delhi, Delhi Police traffic constable, Delhi constable throws brick at woman, Delhi Police, India, India Gate, traffic police, video goes viral,

In a shocking incident in the national capital, a Delhi Police traffic constable was seen throwing a brick at a woman during an altercation that reportedly took place near India Gate

ITEMVIDEOS: లంచమివ్వలేదని చంటిపిల్ల ఎదుటే తల్లిపై ఇటుకతో ‘కాకీ’ దాడి

Posted: 05/11/2015 05:18 PM IST
Delhi traffic cop hits woman with bricks suspended

దేశ రాజధానిలో ఓ కాకీ దారుణానికి ఒడిగట్టింది. లంచమివ్వలేదని చంటి పిల్ల ఎదుటే తల్లిపై ఇటుకతో దాడికి తెగబడింది. ఇది ఏ కాకీ అనుకుంటున్నారా..? అదే నండీ దారిపై వెళ్లే వారికి ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్భాలలో దారి చూపించే కాకీ. అర్థమైందనుకుంటాను. ట్రాఫిక్ కానిస్టేబల్. దేశ రాజధానిలో అసలే ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువగా నమోదతున్న చోట.. ఇలాంటి ఘటనలు కూడా చోటుచేసుకోవడం.. ఈ ఘటనను వీడియో తీసి నెట్ లో అప్ లోడ్ చేయడంతో.. క్షణాల మీద విషయం ప్రపంచానికి తెలిసిసోవడంతో చేసిది లేక పోలీసులు తమ గూటికి చెందిన పక్షిని సస్సెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ సౌత్ ఢిల్లీలో స్కూటీపై వెళుతుండగా సతీష్ చంద్ర అనే  హెడ్ కానిస్టేబుల్  ఆమెను ఆపాడు. నిబంధనలు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నావంటూ మహిళను ఆపి లంచం డిమాండ్ చేశాడు.  అందుకు ఆ మహిళ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. అదికాస్తా వాగ్వివాదానికి దారితీసింది. దాంతో సహనం కోల్పోయిన సతీష్ చంద్ర ...మహిళ అన్న ఇంకితం కూడా మర్చిపోయి అమెపై ఇటుకతో దాడి చేశాడు.  ఈ వ్యవహారాన్ని దారిన వెళ్లే వాళ్లు తీసిన వీడియో బయటకు రావటంతో కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో క్లిప్ ఆధారంగా కానిస్టేబుల్పై  క్రిమినల్ కేసు నమోదైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Police  India  India Gate  NewsTracker  traffic police  

Other Articles