high court | RTC | Strike | Fitment

High court order to tell decision on strike within one hour

high court, RTC, Strike, Fitment, Telangana, Ap, Buses

High court order to tell decision on strike within one hour. High court order to dismiss the rtc strike and court will order to the both govt to clear the employees problems in two weeks.

సమ్మె పై గంటలో తేల్చండి.. ఆర్టీసీ ఉద్యోగులపై హైకోర్ట్ ఆగ్రహం

Posted: 05/12/2015 12:10 PM IST
High court order to tell decision on strike within one hour

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మెను వెంటనే విరమించుకోవాలని హైకోర్ట్ ఆదేశించింది. ఉమ్మడి హైకోర్ట్ లో రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలని, రెండు వారాల్లో సమస్యల పరిష్కారానికి ఆదేశిస్తామని హామీ ఇచ్చింది. తమ ఆదేశాలను పాటిస్తారో లేదో గంటలో చెప్పాలని హైకోర్ట్ కార్మిక సంఘాలను ప్రశ్నించింది. తాము ముందే సమ్మె నోటీసులుల ఇచ్చామన్న కార్మిక సంఘాల వాదనలతో హైకోర్ట్ ఏకీభవించినా, ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కాబట్టి సమ్మె నుండి వైదొలగాలని హైకోర్ట్ ఆదేశించింది. అయితే ఒకవేళ సమ్మె విరమణకు సిద్దంగా లేకపోతే ఎస్మా ప్రయోగిస్తామని హైకోర్ట్ వెల్లడించింది. అయితే తాము ఎస్మా పరిధిలోకి రామని హైకోర్ట్ కు కార్మిక సంఘాలు వెల్లడించాయి. దాంతో ఆగ్రహించిన కోర్ట్ గంటలోపు సమ్మె విరమించాలని, లేని పక్షంలో ఏం చెయ్యాలో ప్రభుత్వాలను ఆదేశిస్తామని తెలిపింది. మరి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high court  RTC  Strike  Fitment  Telangana  Ap  Buses  

Other Articles