కర్నూలులో కానిస్టేబుళ్లు వీరేశ్, మురళీకృష్ణారెడ్డి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు చకచకా విచారణ చేపట్టగా.. కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కానిస్టేబుళ్లు ‘గే’లని.. ఇద్దరూ తరచూ కలుసుకునే క్రమంలో లైంగిక కార్యకలాపాల్లోనూ పాల్గొనే వారని తెలిసింది. అయితే.. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటానికి వీరిలో ఒకరికి పెళ్లి నిశ్చయం కావడమేనని కారణమని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్లగా.. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి గన్‌మ్యాన్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ మురళీకృష్ణ(పీసీ 2435), క్రిష్ణగిరి పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న సివిల్ కానిస్టేబుల్ వీరేష్(పీసీ 1468)లు కు కొంతకాలం క్రితం స్నేహబంధం ఏర్పడింది. అయితే.. ఇద్దరిలోనూ స్వలింగ సంపర్క లక్షణాలు వున్న నేపథ్యంలో లైంగిక బంధం ఏర్పడిందని సన్నిహితులు తెలుపుతున్నాయి. మురళీకృష్ణకు చెందిన ఏఆర్ క్వార్టర్ లో తరుచూ కలుసుకునే వీరు లైంగిక కార్యకలాపాల్లో మునిగిపోయేవారట! కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
అయితే.. మురళీకి కలుగొట్ల గ్రామానికి చెందిన మేనకోడలితో ఈనెల 30, 31 తేదీల్లో పెళ్లి జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. దీంతో తమ మధ్య వున్న సన్నిహిత బంధం తెగిపోతుందని తీవ్ర ఆవేదనకు గురైన వీరేష్.. మురళీ గొడవ పడినట్లు సమాచారం. ఆ సందర్భంగా అతడిని కాల్చడంతో పాటు తనూ కాల్చుకుని చనిపోయినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. మృతదేహాల పక్కన తుపాకీ ఉండటంతో ఆ మేరకు నిర్ధారణకు వచ్చారు.
ఇలా కాకపోతే.. సన్నిహితంగా ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకుని దూరమవుతుండటాన్ని జీర్ణించుకోలేక వీరేష్.. ముందుగా తనను తాను కాల్చుకున్నాడని అనుమానిస్తున్నారు. అనంతరం తమ ‘గే’ బంధం ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళనతో మురళీ కూడా తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని వుంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి గన్‌మ్యాన్‌గా ఉన్న మురళీకృష్ణ తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని అనుమతి తీసుకుని కర్నూలుకు చేరుకున్నాడు. ఈ విషయం వీరేష్ తెలుసుకుని అతని గదికి వెళ్లి ఒకరినొకరు నిందించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలపై రక్తం గడ్డకట్టి ఉండటంతో మధ్యాహ్నం ఆ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more