RTC | High court | ap | fitment | clash

Rtc employees decided to continue the strike

RTC, High court, ap, fitment, clash

RTC employees decided to continue the strike. But high court order to stop the strike immuidiate. ap govt ministers and officials didnt ready to give proposed fitment.

ఆర్టీసీ కార్మికులు సై . మరి హైకోర్ట్ ఏమంటుందో..?

Posted: 05/13/2015 01:23 PM IST
Rtc employees decided to continue the strike

అవును హైకోర్ట్ తీర్పునే బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగించడాన్ని కోర్ట్ తప్పుపట్టింది. తమ మాటనే లెక్క చెయ్యరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హైకోర్టు తీర్పును లెక్క చెయ్యడం కాదు అసలు ఏం చేసుకుంటారో అన్నట్లు ఆర్టీసీ కార్మికులు వ్యవహరిస్తున్నారు. మరో గంటలో సమ్మె నుండి విరమించాలని హైకోర్ట్ ఆదేశించినా, పట్టించుకోవడం లేదు ఆర్టీసీ కార్మికులు. సమ్మె నుండి వైదొలగకపోతే.. జైల్ కు కూడా వెళ్లాల్సి వస్తుందని హైకోర్ట్ వెల్లడించింది. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం అంటూ సవాల్ విసిరారు.

మరోపక్క ఏపి సర్కార్ తో ఆర్టీసీ కార్మికుల చర్చలు ప్రతికూల వాతావరణంలొ సాగాయి. మంత్రి సిద్దా ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో అదికారులు, మంత్రులపై ఆర్టీసీ యూనియన్ల నాయకులు కారాలు మిరియాలు నూరారు. ఎన్నికలకు ముందు టిడిపి పార్టీ ఫిట్ మెంట్ ఇస్తామని ప్రకటించిందని.. కానీ ఇప్పుడు మాత్రం మాట దాటవేస్తోందని అన్నారు. మరోపక్క కావాలనే మీ పార్టీ నాయకులతో కోర్టులో కేసులు వేయిస్తారా.. అయితే ఎంతకైనా సిద్దం .. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం అంటూ యూనియన్ నాయకులు ఖరాఖండిగా చెప్పేశారు. దాంతో పరిస్థితి ఉత్కంటంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  High court  ap  fitment  clash  

Other Articles