RTC | Telangana | Ap | Fitment

Telugu content

RTC, Telangana, Ap, Fitment,

Ap and telangana state govt agree to give 43 percent fitment. RTC employees meet the ministers in both states. Both govts are ready to give demending fitment.

తెలుగు రాష్ట్రాల్లో బస్సులకు లైన్ క్లీయర్!.. ఫిట్ మెంట్ కు ఓకే

Posted: 05/13/2015 03:21 PM IST
Telugu content

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మెపై ఇప్పుడిప్పుడు అన్ని అరిష్టాలు తొలిగిపోతున్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వాలు జరిపిన చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. దాంతో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మంచి శుభవార్తతోనే శుభం కార్డు పడనుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఆర్టీసీ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో గత రాత్రి మంత్రి వర్గ సబ్‌ కమిటీతో కేసీఆర్‌ జరిపిన చర్చల సారాంశాన్ని కార్మిక నేతలు వివరించినట్లు తెలియవచ్చింది. ఫిట్‌మెంట్‌ విషయం కూడా ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలియవచ్చింది. అధికారికంగా బుధవారం సాయంత్రం 3 గంటలకు ప్రకటిస్తారని సమాచారం. సమావేశం సుమారు గంటకు పైగా జరిగింది. అలాగే ఆర్టీసీ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, తరుపరి తీసుకోవలసిన చర్యలు, కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలియవచ్చింది. సమావేశం ముగిసిన అనంతరం కార్మిక సంఘాల నేతలు సెక్రటేరియట్‌లో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కలవడానికి వచ్చారు. అక్కడ మంత్రి లేకపోవడంతో నేతలు వెనుదిరిగారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చింది. కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది. అయితే బకాయిల విషయంలో మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఫిట్మెంట్ విషయంలో జరిగిన చర్చలు సఫలం అయినట్లయింది. ప్రధాన సమస్య పరిష్కారం అయిపోవడంతో ఇక మరి కొంతసేపట్లోనే ఆర్టీసీ సమ్మె కూడా విరమించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, పాత బాకీలు కూడా ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతున్నారు. అవి లేకుండా ఇప్పటినుంచి ఇస్తామని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ఒక్క అంశం మీదే ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పాత బాకీలు ఇవ్వకుండా ప్రస్తుతం మాత్రమే ఫిట్మెంట్ ఇస్తే ప్రభుత్వంపై రూ. 900 కోట్ల భారం పడుతుందని అంటున్నారు. అదే 2004 నుంచి బకాయిలు చెల్లించాల్సి వస్తే మరో రూ. 1108 కోట్ల భారం పడుతుందని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చల్లో ముఖ్యాంశాలు..

*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆర్టీసీ కార్మికుల చర్చలు
*ఏపిలో కేబినెట్ కమిటితో చర్చలు
*ఏపికి 43 శాతం ఫిట్ మెంట్ కు ఓకే
*సగం బాండ్లు, సగం నగదు రూపంలో ఆర్టీసీ
*తెలంగాణ కార్మికుల ఫిట్ మెంట్ పై మరికొద్దిసేపట్టో కేసీఆర్ ప్రకటన
*43 శాతం ఫిట్ మెంట్ తో ఆర్టీసీపై 828 కోట్ల భారం
*ఆర్టీసీ కార్మికులతో చర్చలు సఫలం అని ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు
*కార్మిక పక్షపాతిగా మా ప్రభుత్వం వ్యవహరిస్తోంది- అచ్చెన్నాయుడు
* ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది అయినా ఫిట్ మెంట్ ఇవ్వడానకి ప్రభుత్వం ముందుకు వచ్చింది - అచ్చెన్నాయుడు
* ఆర్టీసీ కార్మికులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన- అచ్చెన్నాయుడు
*ేప్రిల్, మే, జూన్ ఏరియల్స్ దసరా, దీపావళకి చెల్లించాలని ఆలోచిస్తున్నాం- అచ్చెన్నాయుడు

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Telangana  Ap  Fitment  

Other Articles