ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం గత జన్మ పుణ్యఫలమేనంటుంటారు కొందరు. అది నిజమో కాదో తెలియదు కానీ, ఉద్యోగాలు దోరికేంద వరకు నిరుద్యోగుల బాధలను అనుభవించిన యువకులు.. ఉద్యోగం లభించగానే వాటిని పూర్తిగా మర్చిపోయి.. లంచాలు తీసుకుంటూ ముప్పూటలా భోజనాలు కూడా మని లంచాలనే మేస్తుంటారు కొందరు అధికారులు. మేము చాలా కష్టాలను అనుభవించాం.. వాటి గురించి మావద్ద ప్రస్తావన తీసుకురావద్దని అంటూనే లంచం ఉంటే తప్ప నోట మాట కూడా జాలువారనీయకుండా జాగ్రత్త పుడుతుంటారు. ప్రతీ పనిలోనూ కక్కర్తి పడి.. జాలీ, దయ, మానవత్వం అనేవి ఏ కోశాన లేకుండా అందిన చోటల్లా.. అందిన మేర మేసేస్తూ.. నీతి సూక్తులు మాత్రం బొలడెన్ని చెప్పేస్తుంటారు. అలాంటి ఇద్దరు లాంచావతారాలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు నగ్నంగా దోరికిపోయారు.
సరూర్ నగర్ మండలం బడంగ్‌పేట నగర పంచాయతీపై దాడి చేసిన ఏసీబీ అధికారులు కమిషనర్ త్రిలేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దనూ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.72వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ.23,57,752 బిల్లు మంజూరు కోసం ఎన్.శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి కమిషనర్, సీనియర్ అసిస్టెంట్ ఇద్దరూ కలిపి 3 శాతం కమిషన్, సుమారు రూ.72వేలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నెలరోజులుగా కాంట్రాక్టర్‌ను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్టు సమాచారం. ముందుగా డబ్బులు వెచ్చించి కాస్తో, కూస్తో వచ్చే లాభంతో తమ సంసారాలను పోషించుకునే కాంటాక్టర్లకు వారి బిల్లులను ఇచ్చేందుకు కూడా కమీషన్లను డిమాండ్ చేయడం భావ్యమా..? మీరే చెప్పండి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more