Salman Khan Arms Act case: Court rejects actor’s plea to re-examine witnesses

Arms act case jodhpur court rejects salman khan s plea of witness re examination

Salman Khan, Salman Khan news, Salman Khan Arms Act case, Salman Khan Blackbuck poaching case, Bollywood, petition, rejected, jodhpor court, Arms Act case|Black Buck

In a setback for Bollywood actor Salman Khan, a Jodhpur court on Thursday rejected his plea for re-examination of witnesses in a case related to illegal possession and use of arms.

జోధ్పూర్ కోర్టులో సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు..

Posted: 05/14/2015 04:33 PM IST
Arms act case jodhpur court rejects salman khan s plea of witness re examination

బాలీవుడ్ కండలవీరుడు హీరో సల్మాన్ ఖాన్ కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను జోథ్ పూర్న్యాయస్థానం కొట్టివేసింది. హిట్ అండ్ రన్ కేసులో బొంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ తో సంబరాల్లో మునిగి తేలుతున్న ఆయనకు ఇవాళ జోథ్పూర్ కోర్టు షాక్ ఇచ్చింది. 1998 అక్టోబర్ 15న సూరజ్ భర్జాతీయ సినిమా హహ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ లో భాగంగా రాజస్తాన్ లోని జోధ్ పూర్ వెళ్లినప్పుడు.. షూటింగ్ విరామ సమయంలో పలువురు సహచరులను వెంటబెట్టుకుని స్థానిక అడవులలోకి వెళ్లిన ఆయన కృష్ణ జింకలను వెంటాడి చంపాడు.

కాగా సల్మాన్ ఖాన్ పై అటవీ శాఖ అధికారులు మూగజీవాలను వెంటాడిన కేసును నమోదు చేశారు. దీంతో పాటు ఆయన ఆయుధాలకు వున్న లైసెన్స్ గడువు కూడా తీరిపోవడంతో సల్మాన్ ఖాన్ పై అక్రమంగా ఆయుధాలను కలిగివున్నాడన్న కేసును కూడా అటవీ శాఖ అధికారులు నమోదు చేశారు. పదహారేళ్ల కిందట ఈ కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్ ను తిరస్కరించింది. సాక్షులను పునర్విచారించేందుకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Bollywood  petition  rejected  jodhpor court  

Other Articles