porn sites | modi | serious | sunny leon

Central govt concentrate on prohibition of porn sites modi very serious on porn sites in net

porn sites, modi, serious, sunny leon

central govt concentrate on prohibition of porn sites. Modi very serious on porn sites in net.

పోర్న్ సైట్లకు అడ్డుకట్ట పడుతుందా..? లేదా..?

Posted: 05/16/2015 10:52 AM IST
Central govt concentrate on prohibition of porn sites modi very serious on porn sites in net

నెట్ ఓపెన్ చేస్తే చాలు ఎలాగోలా పోర్న్ మన కంటికి కనిపిస్తుంది. యాడ్ ల రూపంలోనో లేదా ఫోటోలో ఏదోలా మన దృష్టిన్ని ఆకర్షించేలా పోర్న్ సైట్ లు హడావిడి చేస్తున్నాయి. అయితే మామూలు జనాలు, ఆడవాళ్లు, చిన్న పిల్లలు నెట్ వాడదామన్నా ఎక్కడొచోట బూతు పురాణం కంటికి కనిపిస్తోంది. కొన్ని లక్షల వెబ్ సైట్ లు పనిగట్టుకొని మరీ బూతు పాఠాలు నేర్పతున్నాయి వెబ్ సూట్లు. అయితే ఎవరు ఎన్ని సార్లు విన్నవించుకున్నా.. కోర్టులు కలగజేసుకొని మరీ ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసినా ఏం ప్రయోజనం లేకుండా పోతోంది. అయితే తాజాగా పోర్న్ సైట్లను కట్టడి చెయ్యాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు జారీ చెయ్యడం, తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిల్ దాఖలు చెయ్యడం.. థానేలో సన్నిలియోన్ పై కేసులతో మీడియా వార్తలకెక్కింది.

తాజాగా ప్రభుత్వం పోర్న్ వెబ్‌సైట్లపై దృష్టిసారించింది.  పోర్న్ సైట్లపై మోదీ కన్నెర్రజేయడంతో, వాటి భరతం పట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఆయా సైట్ల నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను మోదీ ఆదేశించారు. దీనికి సంబంధించి అశ్లీల వెబ్‌సైట్స్‌ జాబితాను తయారు చేయాల్సిందిగా ఆయన కోరారు. భారతీయ సంస్కృతికి ఇవి విరుద్ధం కాబట్టి వాటిని నిరోధించాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఇలాంటి సైట్లు దాదాపు 4 కోట్ల దాకా ఉంటాయని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీమ్‌ అంచనా వేసింది. వాటి వల్ల అత్యాచారాలు, మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని, కాబట్టి వీటిని నిరోధించాలనిన్యాయవాది కమలేశ్‌ వాస్వానీ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.  అశ్లీల సైట్లపై ఉక్కుపాదం మోపాలన్న సర్కార్ నిర్ణయంతో సీఐడి విభాగం ఒక అడుగు ముందుకు వేసింది. అశ్లీల వైబ్సైట్లను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర సీఐడీ విభాగం నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. అశ్లీల సైట్ల వల్ల యువత పెడదారి పడుతోందని పిటిషన్‌లో పేర్కొంది. నేరాల సంఖ్య పెరగడానికి అశ్లీల వెబ్ సైట్లు కూడా ప్రధాన కారణంగా మారాయని పిటిషన్ పేర్కొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : porn sites  modi  serious  sunny leon  

Other Articles