ఆయన కేంద్ర మంత్రివర్యులు.. దీంతో తానేం చేసినా చెల్లబాటు అవుతుంది అనుకుంటే పొరబాటే. మేము కేంద్ర అమాత్యులం మాకు ఎదురుతిరుగుతారా..? మే ఎలాగైనా వెళ్తాం అనుకుంటే పరాభవం జరగక తప్పదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటారా..? కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ఇవాళ పాట్నా విమానాశ్రయంలో.. అలాంటి చేదు అనుభవం ఎదురైంది. పాట్నా విమానాశ్రయానికి వస్తున్న మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను రిసీవ్ చేసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆయన సమయం అసన్నమవుతుందని భయటకు ( ఎగ్జిట్ ) వచ్చే గేటు నుంచి విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతే అక్కడున్న ఓ మహిళా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. అతడిని అడ్డుకుంది. ఇది వీఐపీ ఎంట్రెన్సు గేటు కాదని, పక్కనుంచి వెళ్లాలని సూచించింది. దీంతో పాపం అమాత్యుల గారు వేరే మార్గం గుండా విమానాశ్రయం లోనికి వెళ్లక తప్పలేదు
అయితే అనుమతించిన ప్రవేశ ద్వారం నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా తనను పంపించాలని వాదనలు చేసిన కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ అనంతరం తన తప్పును తెలుసుకుని తనను తాను నిందించుకున్నారు. తాను అలా చేయడం ఏ మాత్రం సరికాదని, తనది ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకున్నారు. ఇప్పటికే వీఐపీల సంస్కృతిపై తీవ్ర వివాదం నెలకొన్న నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఎంపీ విషయం చర్చనీయాంశం అయింది. బీహార్లోని పాట్నా విమానాశ్రయంలో మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను రిసీవ్ చేసుకునేందుకు మంత్రి రామ్ కృపాల్ వెళ్లారు.
ఆయన ఎగ్జిట్ (బయటకు) మార్గం ద్వారా వెళుతుండగా అక్కడ ఉన్న ఓ మహిళా అధికారి అడ్డుకొని అందరిలాగే (ఎంట్రీ) ప్రవేశ ద్వారం వెళ్లాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే తన ఉద్యోగం పొతుందని కూడా చెప్పారు. అయినప్పటికీ ఆయన ఆమెతో కాసేపు స్వల్ప వాదోవాదాలకు దిగడంతో ఆమె పై అధికారులను కూడా సంప్రదించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడం, దానిపై విమర్శలు కూడా తలెత్తడంతో కేంద్ర మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. విధులు సక్రమంగా నిర్వహించిన ఆ అధికారిని మెచ్చుకున్నారు కూడా దీంతో అమాత్యా అడుసు తోక్కనేలా.. కాలు కగడనేలా అంటూ పలువురు సూచనలు చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more