Salman Khans Shoot in Kashmir Has Locals and Tourists Complaining | Salman Khan

Salman khans shoot in kashmir has locals and tourists complaining

salman khan, bajrangi bhaijan movie, kareena kapoor news, kashmir people, kashmir locations, kashmir tourism

Salman Khans Shoot in Kashmir Has Locals and Tourists Complaining : The Bajrangi Bhaijaan unit has been filming in Sonmarg and Pahalgam for about a month now and police have restricted access to the area

సల్మాన్ కారణంగా నిరుద్యోగులుగా మారిన కాశ్మీరులు

Posted: 05/20/2015 12:02 PM IST
Salman khans shoot in kashmir has locals and tourists complaining

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవలే హిట్ అండ్ రన్ కేసు నుంచి ఊరట పొందాడో లేదో.. అప్పుడే మరో వివాదంతో తెరపైకి వచ్చేశాడు. ఈ హీరో వల్ల కాశ్మీరులు నిరుద్యోగులుగా మారాల్సి వచ్చింది. ఒకే వ్యాపారాన్ని నమ్ముకుని పొట్ట నింపుకునే అక్కడ ప్రజలకు.. సల్మాన్ వల్ల గత పదిరోజులుగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో ఉపాధి కోల్పోయిన వారంతా సల్మాన్ మీద గుర్రుగా వున్నారు. కేవలం వీరే కాదు.. అక్కడి అందాలను తిలకించేందుకు వెళ్లిన టూరిస్టులు సైతం సల్మాన్ ని చివాట్లు పెడుతున్నారని సమాచారం! ఇంతకీ సల్మాన్ ఏం చేశాడు? అనేగా సందేహం! అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘బజ్రింగీ భాయిజాన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీ షూటింగ్ నిమిత్తం యూనిట్ మొత్తం కాశ్మీర్ కి వెళ్లాల్సి వచ్చింది. కాశ్మీర్ లోని సోనామార్గ్, పహల్ గావ్ అనే ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కారణంగానే అక్కడి స్థానికులు, టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి టూరిస్టులు వెళ్లేందుకు భద్రతా దళాలు అంగీకరించడం లేదు. దీంతో కాశ్మీరు అందాలను తిలకించేందుకు వచ్చిన వందలాదిమంది టూరిస్టులు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం టూరిస్టులు వస్తే జరిగే వ్యాపారంతో పొట్ట నింపుకునే అక్కడి ప్రజలకు వారు రాకపోవడంతో గత పదిరోజులుగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో వారంతా ఉపాధి కోల్పోయారు.

నిజానికి కాశ్మీర్ లో అత్యంత అందమైన ప్రాంతాలు సోనామార్గ్, పహల్ గావ్ ప్రాంతాల్లోనే వుంటాయి. ఎక్కువ టూరిస్టులు వీటిని వీక్షించేందుకు ఎక్కువగా వస్తారు. అదే ప్రాంతంలోనే షూటింగ్ జరుగుతుండటంతో భద్రతా దళాలు అక్కడ విహరించేందుకు టూరిస్టులకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో గత 10 రోజులుగా అక్కడుండే 10 వేలమంది ప్రజలకు ఎలాంటి పనీలేకుండా పోయిందని తెలుస్తోంది. పర్యాటకులు సైతం ఆ ప్రాంతాలకు చేరే దారిలేక ఇదేంపనంటూ విమర్శిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన వారంతా, ప్రభుత్వం కల్పించుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. దీంతో.. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చిత్ర సిబ్బందికి ప్రభుత్వం సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  bajrangi bhaijan movie  kareena kapoor news  kashmir people  

Other Articles