Cong's Jana Reddy meets TRS's KK

Congress leader janareddy met trs senior leader kk

Congress senior leader JanaReddy, Telangana congress LP chief jana reddy, MP k KeshavaRao, rajya sabha member kk, trs party secratary general kk, congress, mlc seat, Trs to contest fifth mlc seat

Former Minister and Congress senior leader Jana Reddy on Wednesday morning met TRS senior leader KK.

రాజకీయ ప్రాధాన్యం లేకపోయినా.. అంతరంగికం అర్ధమైంది..

Posted: 05/20/2015 01:39 PM IST
Congress leader janareddy met trs senior leader kk

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీకి చెలగాటంగా ప్రత్యర్థి పార్టీలకు ఇరకాటంగా మారునున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ.. నాలుగు స్థానాలతో పాటు అయిదో సీటుపై కూడా కన్నేసిన టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టేందుకు నిర్ణయించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనుంది. అయితే ప్రధాన పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రాత్రికల్లా టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి.

ఇదిలావుండగా, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బుధవారం ఉదయం టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుతో భేటీ అయ్యారు. కేకే నివాసానికి, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి వెళ్లడం చర్చనీయాంశమయ్యింది. ఇద్దరు సుమారుగా అరగంట పాటు చర్చించారు. అయితే వీరిమధ్య ఎమ్మెల్సీ అభ్యర్థి విషయమై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా భేటీ అనంతరం కేకే మాట్లాడుతూ తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.

దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఎవరని నిలిపేది ప్రభుత్వం ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రకటించనుంది. ఒకే ఒక్క సీటు కోసం బరిలో 40 మంది నేతలు పోటీ పడుతున్నారు. టి కాంగ్రెస్‌ సీనియర్లు, జూనియర్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం నెలల తరబడిగా పార్టీ హై కమాండ్‌తో లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. అభ్యర్ధి ఎంపిక అధికారం సోనియాగాంధీ చేపడితే.. సీనియర్లకు... రాహుల్‌ సిఫారసే కీలకమైతే జూనియర్లకు కూడా ఎమ్మెల్సీ ఛాన్స్‌ రావచ్చనేది టి కాంగ్రెస్‌ నేతల అంచనా.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jana reddy  kk  trs  cong  

Other Articles