youth hacks over 20 facebook accounts to circulate pornography

Youth hacks facebook accounts to circulate pornography

youth hacks 20 facebook accounts to circulate pornography, facebook, hack, fake accounts, pornography, facebook, fb hack, fake accounts, pornography, social media

Over a period of six months, he hacked over 20 Facebook accounts. And the purpose was to circulate porn materials and demand money from unsuspecting people.

హ్యాకింగ్ చేసిన యువకుడికి అరదండాలు..

Posted: 05/21/2015 04:01 PM IST
Youth hacks facebook accounts to circulate pornography

హ్యాకింగ్ చేయడం వచ్చునని తన విద్యను ప్రదర్శించిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అదేంటి హ్యాకింగ్ చేయడం నేరమా..? అంటే హ్యాకి చేసి అంతటితో వదిలేయకుండా వాటిల్లో అసభ్య చిత్రాలను పోస్టు చేసి.. వారిని బ్లాక్ మెయిల్ చేసి.. వారి నుంచి అక్రమంగా డబ్బును వసూళ్లు చేస్తే.. కటకటాల వెనక్కి కాకుండా.. ఇంకెక్కడికి పంపుతారు. విషయం అర్థమైందికదా.. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని యమునా నగర్ కు చెందిన అరవింద్ సింఘాల్ (24) అనే యువకుడు దాదాపు 20 మంది ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేశాడు. ఆరు నెలలుగా వారి ఖాతాల్లోకి పోర్న్ చిత్రాలను పెడతానని బెదిరిస్తూ డబ్బు గుంజడం ప్రారంభించాడు.

తన ఫేస్ బుక్ ఖాతాలోకి అసభ్య చిత్రాలు వస్తుండటంతో నహన్ ప్రాంతానికి చెందిన సర్వేశ్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇతనితో పాటు పలువురు అరవింద్ బాధితులు కూడా పోలీసులకు తమను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయమై పిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు  అరవింద్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరపి కటకటాల వెనక్కి నెట్టారు. అతడి వద్ద నుండి మొత్తం 17 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫేస్ బుక్ పాస్ వర్డ్స్ కోసం ఉపయోగించేవాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆగడాలకు అడ్డుకట్ట పడింది.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  hack  fake accounts  pornography  

Other Articles