Jet Airways puts 1 million economy class tickets on discount sale

Jet airways offers 25 discount on 1 million domestic tickets

Jet Airways, Economy Class Tickets On Discount Sale, Jet Airways Puts 1 Million Economy Class Tickets On Discount Sale, Private carrier Jet Airways, 1-million economy class seats up for sale, flat 25 percent discount, domestic network

Private carrier Jet Airways today put 1-million economy class seats up for sale, with a flat 25 percent discount for a limited period, on its domestic network.

జెట్ ఎయిర్ వేస్ సరికోత్త డిస్కౌంట్ ఆఫర్..

Posted: 05/29/2015 02:10 PM IST
Jet airways offers 25 discount on 1 million domestic tickets

విమానయాన రంగంలో తీవ్ర పోటీ ప్రయాణికులకు వరంగా పరిణమించింది. చౌకధరలతో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్న నిత్యం ఏదో ఒక పౌర విమానయాన సంస్థ ప్రకటనలు విడుదల చేస్తూ.. కస్టమర్లను అకట్టుకునే ప్రయత్నాలను చేస్తునే వున్నాయి. గతంలో సుమారుగా ఏడాదిలో ఎప్పుడైనా ప్రయాణించే అవకాశాన్ని కూడా కుదించేసి.. కేవలం రెండు మూడు నెలల వ్యవధిని మాత్రమే ఇస్తున్నారు. అది పూర్తయ్యే లోపు మరో ఆఫర్ వస్తుండటంతో.. ప్రయాణికులు కూడా వారికి అత్యంత సరసమైన విమానయాన సంస్థ ఆఫర్ ను ఎంచుకుని ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ దేశీ టికెట్ ధరల్లో 25 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 51 నగరాల గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్న జెట్ ఎయిర్ వేస్ దాదాపు 10 లక్షల ఎకానమీ క్లాస్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తింపచేయనుంది. మే 27న ప్రారంభమైన ఈ ఆఫర్ 30 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నాలుగు నెలల మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పించనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jet Airways  Discount Offer  Tickets  

Other Articles