మానవత్వం మంట కలిసింది. శత్రువైనా ఇంటికి వస్తే.. వారికి నమస్కరించాలని చెప్పే మన దేశ సంప్రదాయాన్ని మంటగలిపేలా డీ మార్ట్ షాపింగ్ మాల్ సిబ్బంది, వారికి తోడు ఓ కాంగ్రెస్ నాయకురాలు వ్యవహరించిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. నిత్యం దురాగతాలను చూసి చూసి మనిషి కూడా అదే బాటలో పయనిస్తున్నాడనటానికి బెంగుళూరులో చోటుచేసుకు్న ఈ ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతన్న ఓ మహిళ అందులోనూ విదేశీ మహిళ చేసిన చిన్న తప్పిదానికి అమెను వివస్త్రను చేసి. దారుణంగా కోట్టి అమె వద్దనున్న 65 వేల డబ్బులు లాకున్న ఘటన ఇది.
వివరాల్లోకి వెళ్తే.. పోరుగు దేశం బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ రషీదా బేగం, తన భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం బెంగళూరు హృదయాలయాలో చేర్పించింది. అయితే అస్పత్రిలోకి అమెను అనుమతిని ఇవ్వకపోవడంతో అమె తన భర్తతో పాటు తనకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేసేందుకు స్థానికంగా వున్న ఢిమార్ట్ షో రూమ్ కు వెళ్లింది. సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయని పోరుగువారు చెబితే అక్కడికి వెళ్లిందే కానీ.. తాను తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు తననే టార్గెట్ చేసి చావ చితకబాదుతారని అప్పుడామెకు తెలియదు.
షాపింగ్ మాల్ లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్న తరువాత.. అమె తాను వేసుకున్న పాదరక్షలు (చెప్పులు) బిల్లు చెల్లించలేదు. ఈ విషయాన్ని సీసీ కెమెరా నుంచి పసిగట్టిన సిబ్బంది వెంటనే అమెను పక్కకు తీసుకువచ్చి అమె వయస్సుకు కూడా మర్యాద ఇవ్వకుండా దాడి చేశారు. అంతేకాదు సభ్యసమాజం తలదించుకునేలా బాధితురాలిని గుడ్డలూడదీసి మరి కొట్టారు. ఈ దాడికి స్థానిక మహిళా కాంగ్రెస్ నేత మంజుల సమక్షంలో జరుగింది. అంతేకాదు అమెకూడా బాధితురాలని చావ చితక కోట్టింది. తన భర్త వైద్యం కోసం అమె దాచుకున్న 65 వేల రూపాయలను కూడా వారు లాక్కున్నారు. దీంతో బాధితురాలు తరపున కొందరు వచ్చి అమెను తీసుకెళ్లి స్థానిక హెబ్బగొడి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. స్థానిక మహిళా కాంగ్రెస్ నాయకురాలు మంజులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై పూర్వపరాలపై ప్రశ్నిస్తున్నారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more