అర్దరాత్రి సినిమా చూపించిన లేడీ డాక్టర్ అనగానే ఎక్కడ...? ఎలా..? అనే డౌట్ వస్తుంది. అయితే అన్నింటికి సమాధానాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి. తప్పతాగిన కొంత మంది వ్యక్తులు అర్థరాత్రి పోలీసులకు చుక్కలు చూపుతున్నారు. అందులో లేడీస్ ఏం తీసిపోవడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఓ లేడీ డాక్టర్ అర్థరాత్రి దాదాపు రెండు గంటపాటు చుక్కలు చూపించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ లేడీ డాక్టర్ చుక్కలు చూపింది. అర్ధరాత్రి ఖాకీలను పరుగులు పెట్టించింది. ఓ ప్రైవేటు హాస్పటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న మంజు అనే మహిళ, రోడ్ నెం 45లో తన కారుతో జోరుగా దూసుకెళ్లింది. డ్రండ్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఖాకీలను చూసి సడెన్‌గా బ్రేకులేసింది. ఖాకీలు ఆమెను చూసేలోపే కారులోనుంచి పరుగులు పెట్టింది. ఆమెను ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు.
ముందు పోలీసులను దబాయించిన డాక్టర్ మేడమ్, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు ససేమిరా అంది. ఖాకీలను కన్వీన్స్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఈ విషయం తన భర్తకు తెలిస్తే గొడవ జరుగుతుందని మారం చేసింది. మర్యాదగా డీల్ చేసిన పోలీసులు, లేడీ కానిస్టేబుల్ సాయంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. 32 శాతం ఆల్కహాలు డాక్టర్ తీసుకున్నట్లు తేలింది. ఆమె దగ్గరున్న డాక్యుమెంట్లు, మొబైల్‌ను పరిశీలించిన పోలీసులు, చలానా రాసి డాక్టర్ వద్ద సంతకం తీసుకున్నారు. ఫైన్ వసూలు చేయడంతోపాటు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తేల్చిచెప్పారు. అయినా ఇంట్లో గొడవ అవుతుందన్న భయం ఆ లేడీ డాక్టర్ లో ఉంటే అలా తప్పతాగి రోడ్ల మీద తిరుగుతుందా..? అని కొంత మంది అనుకుంటున్నారు. కానీ ఈ ఘటనలో మాత్రం పోలీసుల ఓపికకు మాత్రం హాట్సాఫ్ చెప్పాల్సిందే.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more