Bihar, Mango, Police, Protection

Police secutiry for the mango trees

Bihar, Mango, Police, Protection

Police secutiry for the mango trees. Bihar cm Nitesh kumar govt provide police protection for mango trees at Bihar ex cm manghe banglow.

ఆ మామిడిపళ్లకు పోలీసుల కాపలా

Posted: 06/04/2015 11:06 AM IST
Police secutiry for the mango trees

ఎండా కాలంలో ఎండలు మండిపోతున్నా.. జనాలు సంతోషించేది మాత్రం మామిడి పళ్ల రుచికి. దేశవిదేశాల్లో అయినా సరే మన మామిడి పళ్లకు భలే గిరాకీ ఉంది. అందుకే మామిడి పళ్లకు క్రేజ్ చాలా ఉంటుంది. అయితే మామూగా పొలాల దగ్గర మామిడి పళ్ల చెట్టుకు కాపలాగా ఎవరైనా ఉంటారు. లేదంటే ఎవరొ ఒకరు వచ్చి మామిడి పళ్లను కోసుకువెళ్లిపోతారు. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఏంటీ ఆ వార్త అనుకుంటున్నారా..? మామిడి పళ్లకు పోలీసుల పహారా. అవును మీరు చదివింది అక్షరాల నిజం. మామిడికి పోలీస్ పహారానే. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలి అంటే స్టోరీ చదవాల్సిందే..

బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ నివాసం వద్ద ఉన్న వందలాది మామిడి చెట్లకు పండ్లను కోయకుండా ఉండేందుకు గాను నితీశ్ కుమార్ ప్రభుత్వం 24 మంది పోలీసులను నియమించిందని మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా ఆరోపించింది. వీరిలో 8 మంది ఎస్‌ఐలు, 16 మంది కాన్‌స్టేబుళ్లు ఉన్నట్లు తెలిపింది. కాగా, బిహార్ సీఎంగా పదవి నుంచి దిగిపోయినా, మాంఝీ ఇంకా ఆ రాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన 1, ఆన్నే మార్గ్ బంగ్లాలోనే ఉంటున్నారు. మొత్తానికి మాంఝే వారింట్లో మామిడి ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Mango  Police  Protection  

Other Articles