Telangana, Police, Vaccencies, Jobs, Notifications

Telangana state govt prepare to release new job notifications soon

Telangana, Police, Vaccencies, Jobs, Notifications

Telangana state govt prepare to release new job notifications soon. In that notification major posts are alloted for the police department.

పోలీస్ జాబు కావాలా.. నాయనా

Posted: 06/05/2015 08:19 AM IST
Telangana state govt prepare to release new job notifications soon

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ నోటిఫికేషన్లు తొందరలోనే విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే మొత్తంగా లక్షకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం లెక్కలు కట్టింది. అయితే అందులో ప్రాధాన్యతను బట్టి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్ని శాఖల కన్నా శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యత అంశం కాబట్టి తెలంగాణ సర్కార్ ముందుగా పోలీస్ శాఖ మీద దృష్టిసారించింది. మొత్తం లక్ష ఉద్యోగాల్లో తొలి విడుతగా పాతిక వేల ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేన్ విడుదల చెయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం.  ఇందులో భాగంగా పోలీసు శాఖలోనే 10 వేలకుపైగా పోస్టులు ఉన్నాయి.

రాష్ట్ర అవతరణ వేడుకల ముందు వివిధ శాఖల నుంచి అందిన ఈ సమాచారాన్ని సీఎం కార్యాలయం క్రోడీకరించింది. తొలిప్రాధాన్యతగా 31 విభాగాల్లోని 17,960 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రికి నివేదించింది. ఈ ఫైలుపై సీఎం ఆమోదముద్ర వేశారు. ప్రాధాన్య క్రమంలో మిగతా శాఖల్లోని ఖాళీలను సైతం భర్తీ చేయాలని.. నెలాఖరుకల్లా 25 వేల పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీకి అంతా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్క పోలీస్ శాఖలోనే 10,810 పోస్టులను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. వీటిని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో భర్తీ చేయనుంది. 467 పురుష ఎసై్సలు, 77 మహిళా ఎసై్సలు, 59 పురుష ఆర్‌ఎసై్సలు, 3,620 పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్లు), 2,978 పురుష కానిస్టేబుల్‌లు, 338 మహిళా కానిస్టేబుల్‌లు, 2,169 ఏఆర్ కానిస్టేబుళ్లు, 57 మహిళా ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 12 ఎసై్స, 174 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఒక ఆర్‌ఎస్సై, 51 ఎసై్స, 205 ఏఆర్ కానిస్టేబుల్, 275 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు.మొత్తానికి పోలీస్ ఉద్యోగాలు చెయ్యాలని కలలు కంటున్న తెలంగాణ యువతకు కొత్త నోటిఫికేషన్ మంచి అవకాశం ఇవ్వనుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Telangana  Police  Vaccencies  Jobs  Notifications  

Other Articles