Bihar polls: Nitish Kumar meets Rahul Gandhi as alliance talks gain momentum

Nitish kumar meets rahul gandhi in delhi

Bihar polls: Nitish Kumar meets Rahul Gandhi as alliance talks gain momentum, rahul gandhi, nitish kumar, bihar elections, Bihar assembly polls, Lalu Prasad Yadav, RJD, JDU

Bihar Chief Minister Nitish Kumar on Sunday met Rahul Gandhi at his residence here as the talks on alliance to take on BJP in Bihar polls gained momentum.

పరివార్ ను వీడి హస్తంతో దోస్తీ.. రాహుల్ తో నితీష్ భేటీ..

Posted: 06/07/2015 01:25 PM IST
Nitish kumar meets rahul gandhi in delhi

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్ యువనేత, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్న ఆయన రాహుల్ తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. మరో మూడు, నాలుగు మాసాల్లో బిహార్ అసెంబ్లీకి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీ(యూ) పొత్తుకు గల అవకాశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా నితీశ్ తో చర్చలు జరిపారు. జనతా పరివార్ మహా కూటమిపై వీరు చర్చలు జరిపినట్టు సమాచారం.

బిహార్ లో ప్రస్తుతం జేడీ(యూ) ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. అయితే బిహార్ కాంగ్రెస్ నాయకులు పదేపదే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఫిర్యాదు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమకు తగిన గౌరవం ఇస్తేనే మద్దతు ఇస్తామని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీతో నితీశ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు పార్టీల మధ్య పోత్తు కుదిరే అవకాశాలకు ఇరువురు నేతలు సూత్రప్రాయంగా అంగీకారినికి వచ్చినట్లు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  nitish kumar  bihar elections  

Other Articles