ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కోన్ని అరెస్టయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంట్లో ఇవాళ ఏసీబి అధికారులు దాడులు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ఉదయసింహం, సెబాస్టియన్ ఇళ్లల్లోనూ ఏసీబి అధికారులు డీఎస్సీ సునితారెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రేవంత్ రెడ్డి నివాసం నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సుమారు ఐదుగంటల పాటుగా తనీఖీలు కొనసాగుతున్నాయి. రేవంత్ ఇంట్లోని కంప్యూటర్లో.. ఓటుకు నోటు కేసుకు సంబంధించి పలు కీలక ఆధరాలు గుర్తించినట్లు సమాచారం. ఈ కంప్యూటర్లో ఈ కేసుకు సంబంధించి అన్ లైన్ లావాదేవీలను గుర్తించినట్టు తెలుస్తుంది.
ఈ కేసులో నిందితులకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా రేవంత్ నివాసంలో సోదాలు ముగిసాయని హర్డ్ డిస్క్, కంప్యూటర్ ను మాత్రమే తాము తీసుకెళ్తున్నామని ఏసిబి అధికారులు తెలిపారు.రేవంత్ రెడ్డి పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఈ కేసులో మరో నిందితుడైన సెబాస్టియన్ ఇంట్లో పాస్ పోర్టు, బ్యాంకు పాస్ బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉదయసింహ ఇంట్లో విదేశీ మద్యం భారీగా లభ్యమైందని ఏసీబీ అధికారులు తెలిపారు.
కాగా నాలుగు రోజుల కస్టడీ నేటి సాయంత్రంలో ముగియడంతో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని, అతనితో పాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న మరో ఇద్దరు నిందితులు ఉదయసింహం, సెబాస్టియన్ లను ఏసీబి అధికారులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో వారి రిమాండును ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఏసీబి కస్టడీలో అధికారులు తనను ఎంతగానో వేధించారని రేవంత్ రెడ్డి వాపోయారు. తనను బెంచ్‌పై పడుకోబెట్టారని, కనీసం టాయిలెట్‌కు కూడా అనుమతించలేదని ఆయన ఏసీబీ కోర్టు జడ్జికి మొరపెట్టుకున్నారు. కస్టడీలో తనకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదని, రాత్రుళ్ళు నిద్ర పట్టక అలమటించానని రేవంత్ ఫిర్యాదు చేశారు. అంతకు ముందే వారికి ప్రత్యేక వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లిన అధికారులు అక్కడ వారికి వైద్యపరీక్షలు నిర్వహించిన పిమ్మట కోర్టులో హాజరుపర్చారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more