Hyderabad | Cheating |Cyberabad | crime | facebook

A cheater cheat a tecchi in hyderabad and had conned her out of rs 18 lakh

Hyderabad, Cheating,Cyberabad, crime, facebook

A cheater cheat a techie in hyderabad and had conned her out of Rs 18 lakh.Twenty-seven-year-old high school teacher Deepa (name changed) from Gachibowli was befriended by a foreign national online three months back and over time and many chat sessions, she fell in love with him. By the time she realised that the man, who had promised to marry her, was a fraud and approached the Cyberabad Cybercrime police, he had conned her out of Rs 18 lakh.

అంత.. ఇంత అన్నాడు 18 లక్షలు కొట్టేశాడు

Posted: 06/10/2015 01:49 PM IST
A cheater cheat a tecchi in hyderabad and had conned her out of rs 18 lakh

సోషల్ మీడియా మనుషులను దగ్గర చెయ్యడం అందరికి ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే ఆనందం వెనుక మరోకోణం కూడా దాగి ఉంది. ఇదే సోషల్ మీడియాను వాడుకొని కొంత మంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ హైదరాబాదీ అమ్మాయి మోసపోయాను బాబోయ్ అంటూ లబోదిబో మొత్తుకుంటోంది. ఏకంగా పద్దెనిమిది లక్షల రూపాయలు మోసపోయాను అంటూ పోలీసులు కంప్లైంట్ చేసింది అమ్మాయి.  అయితే మ్యాటర్ ఏంటీ అంటే.. హైదరాబాద్ లో ఉంటున్న అమ్మాయికి షేస్ బుక్ లో ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. తనను తాను జియాలజిస్టుగా పరిచయం చేసుకున్న అతను ఆమెతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. చాటింగ్ కాస్తా ప్రేమగా మారింది. చాటింగ్ లో ఏకంగా పెళ్లి ప్రపోజల్ కూడా చేశాడు. దాంతో ప్లాట్ అయిన అమ్మాయి మొత్తం నిజమే అని నమ్మేసింది.

అయితే అలా చెప్పిన తర్వాత ఫారెన్ నుండి తనకు జువెలరీ, ఫారెన్ కరెన్సీ పంపుతున్నానని చెప్పాడు. తొందరలోనే కస్టమ్స్ డిపార్ట్ మెంట్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది అని చెప్పాడు. అతను అన్నట్లే కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ కూడా వచ్చింది. అయితే పారెన్ నుండి పార్సిల్ వచ్చింది కాబట్టి ఫార్మాల్టీస్ ఉంటాయి. అందుకు గాను రకరకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంటూ ఏకంగా పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే తీరా ఆ కొరియర్ చేతికి రాకపోవడంతో అసలు విషయం ఏంటా అని ఆరా తీసింది ఆ అమ్మాయి. అప్పుడు తెలిసింది అసలు నిజం. ప్రేమ పేరుతో మోసపోయానని పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే ఇలా చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమ, పెళ్లి పేరుతో మాయ చేసి డబ్బులు కొట్టేస్తున్నారని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఘరానా మోసానికి ఫేస్ బుక్ మాంచి వేదికగా మారింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Cheating  Cyberabad  crime  facebook  

Other Articles