drunken police officer thrashed by woman for molesting her

Woman thrashes police officer for allegedly molesting her in saharanpur

Woman thrashes police officer for allegedly molesting her in Saharanpur, Woman, Molestation, Policeman, Drainage, Investigation, uttar pradesh, women, police, beat, crime against women, violence against women, harrasement against women, Sadar Bazar area

A woman thrashed a police officer in Saharanpur city of Uttar Pradesh for allegedly molesting her at Sadar Bazar area of the city near a local court.

ITEMVIDEOS: వేధిస్తున్న తాగుబోతు ఖాకీని.. కుమ్మేసిన ధీరనారి

Posted: 06/12/2015 09:26 PM IST
Woman thrashes police officer for allegedly molesting her in saharanpur

అతను చట్టాన్ని పరిరక్షించాల్సిన ఓ అధికారి. బాధ్యతయుతమైన వృత్తిలో కోనసాగుతూ.. చావు దెబ్బలు తిన్నాడు. అదికూడా ఓ మహిళ చేతిలో.. ఎందుకలా..? ఓ మహిళ పోలీసు అదికారిని చితకోట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది... ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటుచేసుకుంది.. అయితే మహిళ పోలీసు అదికారిపై చేయిచేసుకుంటున్న క్రమంలో అక్కడ ప్రజలెవ్వరూ లేరా..? వారు అమెను నిలువరించడంతో విఫలమయ్యారా..? ఇలాంటి ప్రశ్నలే మీ మదిని తొలుస్తున్నాయా...? అక్కడికే వస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సహరాన్‌పూర్‌కు చెందిన ఒక పోలీసు ఆధికారి.. స్థానికంగా వుండే ఓ మహిళను నిత్యం వేదించసాగాడు. పోలీసోడే ఇలాంటి చర్యలకు దిగితే.. ఎవరికి చెప్పుకోవాలని భావించిన మహిళ.. గత కోన్ని రోజులుగా అతని చర్యలను మౌనంగా భరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా యథాతథంగా తనను వేధింపులకు గురిచేసిన అధికారిపై అపరకాళిలా విరుచుకుపడింది. గతి తప్పి పోతున్న ఖాకీని.. కాలర్ పట్టుకుని ఈడ్చుకోచ్చింది. జనసంచారంలోని ప్రాంతంలో ఓ అపార్టుమెంట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనతో అక్కడ జనం గుమ్మిగూడారు.

అందరి సమక్షంలోనే అమె తనను తాను కరుడు గట్టిన ఖాకీ నుంచి రక్షించుకునేందుకు అతడిపై దాడే సరైన చర్య అని భావించిందో ఏమో మొత్తానికి ఉగ్రకాళీలా మారి.. అధికారి చెంపలు చెడామడా చెల్లమనిపించింది. గల్లా పట్టుకొని నిలదీసిన ఆమె..... ఆగ్రహంతో శివమెత్తిపోయింది. మహిళ ఆగ్రహాన్ని అర్థంచేసుకున్నాడో ఏమో.. తోకముడిచిన అధికారి దెబ్బలకు బెదిరిపోయి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటన మొత్తం స్థానికంగా వున్న అపార్టుమెంట్ల ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అధికారిపై కేసు నమోదు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman  Molestation  Policeman  Drainage  Investigation  

Other Articles