జమ్ము కాశ్మీర్ లో బిజేపి మద్దుతుతో పిడిపి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం.. వేర్పాటు వాదుల పట్ల, వారి దుశ్చర్యల పట్ల చేష్టలుడికి చూస్తున్న క్రమంలో అక్కడి హురియత్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. గతంలో పలు సందర్బాలలో పాకిస్తాన్ కు చెందిన జెండాలను ఉరేగించినా.. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఆ చర్యలపై పెద్దగా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంతో.. వేర్పాటు వాదులు రోజురోజుకు బలం పుంజుకుంటున్నారు. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తరువాత వారు రోజుకో విధంగా ప్రభుత్వాలను కవ్విస్తున్నారు. స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
తాజాగా, శ్రీనగర్లోని ఓ మసీదు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను వీధుల్లో ఊరేగించారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కాశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కాశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి.
దీంతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోకి ఇస్లామిక్ స్టేట్ క్రమంగా చాపకింద నీరులా చొచ్చుకొస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు మీద దాడికేసు దోషి అఫ్జల్ గురు అస్థికలను అతడి స్వగ్రామానికి రప్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అదిలోనే చర్యలు తీసుకోని పక్షంలో వేర్పాటు వాదులు మరింత బలం పుంజుకుని కవ్వింపులకు పాల్పడతారని స్తానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో ఇలాంటి సంఘటనలు వద్దంటూ కేంద్రం గతంలో హెచ్చరించినా.. వేర్పాటువాదులు మాత్రం తరచు పాకిస్థాన్ జెండాలను ఎగరేస్తూనే ఉన్నారు.. ఇప్పుడిది అటు కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వానికి, ఇటు బిజేపికి కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more