రెండో పెళ్లి చేసుకోవాలని ఆ దిశగా ఏర్పాట్లు చేసుకున్న ఓ భర్తకు తన భార్య ‘పెళ్లి’ చేసింది. అయితే అలా ఇలా కాకుండా పెద్దవాళ్లు కోపంతో అంటారే.. ఓరేయ్ నీకు పెళ్లి చేస్తాను అని.. సరిగ్గా అలాగే తన భర్త రెండో పెళ్లి సమాచారం అందుకున్న మొదటి భార్య తన బంధువులతో వివాహవేదికకు వచ్చిన తన బంధుజనం చూస్తుండగానే తన భర్తకు పెళ్లి చేసింది. అయితే తన కూతురు కాబోయే వరుడికి ఇదివరకు పెళ్లైందన్న విషయం తెలుసుకుని మనస్తాపానికి గురైయ్యూ వధువు వర్గీకలు కూడా లక్కీగా మరో వరుడు అందుబాటులోకి రావడంతో ఇ వ్యక్తికి వధువునిచ్చి పెళ్లి చేశారు పెద్దలు.
రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం.. ఘట్కేసర్ మండలం రాంపల్లికి చెందిన మంజులకు 1989లో వినోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు. తరువాత 2004 సంవత్సరంలో లంగర్‌హౌస్‌కు చెందిన తన మేనమామ కొడుకు గాజర్ల కిరణ్‌వర్మను పెళ్లి చేసుకున్నారు. సేల్స్ రిప్రసెంటేటివ్ గా పనిచేసే కిరణ్‌వర్మ, మంజుల ఇద్దరు కొంతకాలం విశాఖపట్నంలో నివసించారు. రెండేళ్ల క్రితం ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చారు.
తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో తెలిసిన వారి ద్వారా కిరణ్‌వర్మ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. తనకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు మంచి ముహూర్తం ఉందని, అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. వరకట్నం కింద రూ.లక్ష నగదు, నాలుగు తులాల బంగారం ఇతర కానుకలు మాట్లాడుకున్నారు. వధువు తరఫున కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మంజుల గురువారం రాత్రే కీసర పోలీసుస్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలిపింది.
మంజుల తన తండ్రి రాజేశ్వరరావు, సోదరుడు బాల్‌రాజ్‌లతో కలిసి తాండూరుకు రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే మంజుల పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, ఆధార్‌కార్డు, ఫొటోలు తదితర ఆధారాలు పోలీసులకు చూపించింది. పోలీసులు వధువు తరఫు వారికి జరిగిన విషయం తెలపడంతో మొదట షాక్ తిన్నారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి, కిరణ్‌వర్మను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వరుడి తరఫున వచ్చిన కొందరు దగ్గర బంధువులు మినహా అందరూ అక్కడి నుంచి ఫలాయనం చిత్తగించారు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. కాగా రెండో పెళ్లి తప్పిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. కూతురు పెళ్లి ఆగిపోవద్దని భావించి కొన్ని గంటల వ్యవధిలో గతంలో అనుకున్న బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more