నాజూగ్గా, సన్నగా, స్లిమ్ గా కనబడేందుకు ఆడవాళ్లు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అయితే మరీ సన్నగా, తీగలా కనిపించి. కుర్రకారును ఆకర్షించడంపై మోజులో.. అతివలు అంద విహీనంగా తయారువుతున్నారు. ఇది మేం చెప్పే మాట కాదు సాక్ష్యాత్తు వైద్యులు వెల్లడిస్తున్నా నిజాలు. మహిళలు తమ శరీర సౌందర్యపై చూపే అతి జాగ్రత్తలతో.. అనేక సమస్యలను కోని తోచ్చుకుంటున్నారని కూడా వారు సెలవిస్తున్నారు. లేత మెరుపు తీగలా కనిపించేందుకు అతివలు చేస్తున్న వెర్రి వేషాలతో అన్ని ఇన్నీ కావంటున్నారు. సరిగ్గా బోజనం చేయకపోవడం.. పెద్దలు బలవంత పెడితే తప్ప.. ఓ మెస్తారుగా తినకుండా కడపును మాడ్చుకోవడంతో.. అనేక వ్యాదుల బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు మరో ఛాలెంట్ సామాజిక మాద్యమం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఐస్ బకెట్, ఫైర్ పూల్, తరువాత తాజాగా అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్న చాలెంట్ బెల్లీ బటన్ ఛాలెంజ్. ఇదేంటంటే ఎవరైనా తమ ఎడమ చేతిని శరీరం వెనుక బాగం (వీపు బాగం) నుంచి తమ నాభి (బొడ్డు)ను ముట్టుకోవడమే ఈ సవాల్.. ప్రయత్నించారా..? కాస్త కష్టతరమే అయినా.. ప్రయత్నించగా.. రానిదంటూ ఏముంటుంది. అయితే ఈ సవాల్ మనుషుల ఫిట్ నెస్ ను తెలియజేస్తుందని ఛాలెంజ్ ను తెరమీదకు తెచ్చినవాళ్లు పేర్కోన్నారు. ఫిట్ నెస్ మాట దేవుడెరుగు కానీ, శరీరం ఫ్లెక్సిబుల్ గా వున్నవాళ్లు మాత్రం ఈ సవాల్ ను ఈజీగానే స్వీకరించవచ్చు. వారితో పాటు సన్నగా, నాజుగ్గా వున్నవాళ్లు కూడా ఈ సవాల్ కు సై అనవచ్చు. అయితే ఎట్టోచ్చి కొంత లావుగా వున్నవాళ్లు మాత్రమే ఇది చేయడానికి తంటాలు పడాల్సి వస్తుందంటున్నారు సవాల్ విసురుతున్న వాళ్లు.
వాళ్లెవరూ..? అంటే వాళ్లు చైనీయులు. చైనా దేశంలో వున్న సామాజిక మాద్యమం వైబో లో ఈ సవాల్ హల్ చల్ చేస్తుంది. వేలాది మంది తమ నాబిని టచ్ చేస్తూ.. సెల్ఫీలు దిగి వాటిని వైబోలో పోస్టు చేశారు. దీంతో తమ ఫిట్ నెస్ ను తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైబోలో ఈ విషయమై 13 కోట్ల మంది లైక్ చేయగా, సుమారుగా లక్ష మంది ఈ విషయమై కామెంట్ల రూపంలో చర్చించారని వైబో తెలిపింది. ఇది మగువలకు మాత్రమేనంటూ.. దీంతో అతివల శరీరాలను మరో పరీక్ష అంటూ కొందరు బైబోలో వాయిస్ చాట్ లు కూడా వున్నాయి. మరి అతివలు నాబిని పట్టకోగలిగితే.. ఫిట్ నెస్ అనుకుంటారో.. లేదో తెలియదు కానీ, ఈ ప్రయత్నంలో లేనిపోని సమస్యలను మాత్రం తెచ్చుకోకండి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more