anam rama narayana reddy comment on balakrishna

Anam rama narayana reddy statement on balakrishna

anam rama narayana reddy statement on balakrishna, former minister aanam rama narayana reddy, congress leader aanam rama narayana reddy, actor turned politician nandamuri balakrishna, balakrishna stars are bright, balakrishna, to become chief minister, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, mutaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy

former minister and congress leader anam rama narayana reddy says actor turned politician nandamuri balakrishna stars are bright, and he will become the chief minister

బాలకృష్ణ స్టార్స్ చాలా బ్రైట్ గా వున్నాయి.. ఆయన సీఎం అవుతారు..

Posted: 06/15/2015 07:05 PM IST
Anam rama narayana reddy statement on balakrishna

నందమూరి నటసింహం, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్టార్స్ చాలా బ్రైట్ గా వున్నాయని.. ఆయన తప్పక ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ సిసనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాం నారాయరణ రెడ్డి అన్నారు. తమ తండ్రి నుంచి పార్టీ అధికార పగ్గాలను తీసుకున్న తరువాత మునుపెన్నడూ రాజకీయాలలోకి దిగని బాలకృష్ణ ఈ ధఫా వచ్చిన ఎన్నికలలో పోటీ చేయడానికి కారణం ఇదేనెమోనని, ఇది దైవ సంకల్పమని ఆయన చెప్పుకోచ్చారు. నిజానికి ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణకు కనీసం క్యాబినెట్ లో మంత్రి కూడా ఇవ్వని చంద్రబాబు.. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి పదవినే ఇవ్వనున్నారని అన్నారు. బాలకృష్ణకు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు వున్నాయిన ఆనం చెప్పుకోచ్చారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆనం రాం నారాయణరెడ్డి.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా దొరకారన్నారు. తాను దొరికిన తనువాత కూడా అడ్డంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందన్నారు. తన అవినీతి చరిత్రను ప్రజలపై రుద్దేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోందన్నారు.   వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి విచారణకు సిద్ధమవ్వాలి. చంద్రబాబు స్థానంలో సీఎం అయ్యేందుకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అర్హతలు ఉన్నాయి' అని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఆదేశించారని.. రేవంత్ కేవలం మధ్యవర్తి మాత్రమేనని ఆనం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పు  ఒప్పుకోలేక ట్యాపింగ్ అంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆనం ఆరోపించారు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమకు చంద్రబాబు దారిద్ర్యం పోతుందని బాలయ్య సీఎం అవుతారని భావిస్తున్నారని ఆనం వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణిని వ్యవహరిస్తోందని ఆనం రామ నారాయణరెడ్డి అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anam rama narayana reddy  bala krishna  cash for vote  chandra babu  revanth reddy  acb  

Other Articles