cash for vote scam takes a new turn, ap police handovers muthaiah complaint to cid

Muthaiah complaint transfered to ap cid

cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh crime investigation department, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

cash for vote scam takes a new turn, ap police handovers muthaiah complaint to cid

ITEMVIDEOS: ఆ కేసులో టిట్ ఫర్ టాట్.. అంటున్న టీడీపీ సర్కార్.

Posted: 06/16/2015 01:01 PM IST
Muthaiah complaint transfered to ap cid

ఓటుకు నోటు కేసులో తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో సహా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పక్కా ప్రణాళికతో పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్రంలోని పలు చేట్ల సుమారుగా 130 కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు వాటినే ప్రధానంగా తమ ముందుకు తీసుకుని చర్యలకు ఉపక్రమించనున్నారు. ఇందుకోసం ఈ కేసులో ముఖ్యుడైన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కదలికలను ప్రారంభించారు. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం తమ ముఖ్యమంత్రిపై చర్యలకు ఉపక్రమించిన పక్షంలో తాము ఈ కేసుతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరించేందుకు రెడీ అవుతున్నారు

 

 

ఈ కేసులో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు ఇస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా.. ఏసిబికి పట్టబడగా.. అతనితో పాటు మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహంలను కూడా ఏసిబి అరెస్టు చేసింది. ఈ కేసులో నాలుగో నిందితుడ, మొదటిసారిగా స్టీఫెన్ తో ఓటు కోనుగోలు విషయమై చర్చలు జరిపిన ముత్తయ్య జేరుసలేం మాత్రం.. వారం రోజుల వరకు తెలంగాణలోనే తలదాచుకుని ఆ తరువాత చాకచక్యంగా తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి వెళ్లగానే విజయవాడలోని సత్యనారాయణ పురం పోలిస్ స్టేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ పోలీసులపై పిర్యాదు చేశాడు. అంతేకాదు తమ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఈ కేసులో ఇరికించేందుకు తనపై పోలీసులు బలవంతం చేశారని..న తమ్ముడిని పోలీసులు చిత్రహింసలు పెట్టి చితకబాదారని ఆరోపించారు.

దీంతో ముత్తయ్య పిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు 506, 387 సెక్షఃన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు వాయిస్ శాంపుల్స్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ ఏసీబి.. ఏ క్షణంలోనైనా ఆయనకు నోటీసులు జారీ చేయవచ్చని వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ముత్తయ్య కేసును సత్యనారాయణ పురం పోలీసుల నుంచి సిఐడికి బదిలీ చేసింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అందుబాటులో వున్న ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ముత్తయ్య పిర్యాదును ఏకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు అప్పగించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరారం తెలిపిందని సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muthaiah  satyanarayana puram police  andhra pradesh cid  cash for vote  

Other Articles