am embarrassed as andhra citizen with chandrababu naidu says RGV

Rgv sensational remarks on cash for vote case

RGV, Ramgopal varma, Twitter, Latest News, News from Andhra Pradesh, Telugu News, Hyderabad News, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh crime investigation department, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Tollywood filmmaker Ram Gopal Varma also opened up on this controversial issue Cash for Vote Scam and made some intellectual comments at micro blogging site

ఓటుకు నోటు కేసులో రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Posted: 06/16/2015 09:04 PM IST
Rgv sensational remarks on cash for vote case

వివాదాస్పద ట్వీట్లకు మారుపేరుగా ఉన్న సంచలన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల్ని మరోసారి వేడెక్కించారు. అసలే పలు వివాదాలతో తెలుగు రాష్ట్రాలు నలిగిపోతుంటే.. ఓటుకు నోటు కేసులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ... తెలంగాణ సిఎం కెసిఆర్‌ని పొగుడుతూ ఆయన ఇచ్చిన తాజా ట్వీట్ అయన అభిమానులతో పాటు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలను విస్మయానికి గురిచేసింది. మహామహా రాజకీయ నేతలే.. ఈ విషయంలో మౌనం వహించగా, రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇలా ట్విట్ చేసే ధైర్యం చేశారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏం చేసినా.. దానిని సినిమా రూపంలో చూపాలే తప్ప.. ఇలా ట్విట్ చేసి వివాదాస్పందంగా మారడం ఎందకంటూ ఆయన అభిమానులు కోరుతున్నారు.
 
చంద్రబాబు నాయుడు జాతీయస్థాయిలో ఆంధ్రుల పరువు తీశారని, ఆయన తీరుతో ఒక ఆంధ్రుడిగా తాను ఇబ్బందికరమైన పరిస్థితికి గురయ్యానన్న వర్మ, తెలంగాణ సిఎం కెసిఆర్ ముక్కుసూటితనానికి శిరస్సు వంచుతున్నానని ట్వీట్ ఇచ్చారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపైనా వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. రేవంత్ తెగువ, ముక్కుసూటితనం తనకు నచ్చిందంటూ... ఈ విషయంలో చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చెయ్యడం ద్వారా మరింత ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోరని తాను ఆశిస్తున్నానన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Ramgopalvarma  Twitter  cash for vote  

Other Articles