బాలీవుడ్ బిగ్ బీ, ఆయన కుమారుడు-నటుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరి గొంతులకు త్రివర్ణ పతాకం చుట్టుకుంది. తమ అభిమానం చాటేందుకు జాతీయ పతాకాలను తమ దేహాలకు వారు చుట్టుకోగా.. అది అటు-ఇటు తిరిగి చివరికీ వాళ్లకు గొంతులకు చిక్కుకోక తప్పలేదు. దీంతో కాస్త కోపాద్రిక్తుడైన చేతన్ ధిమాన్ అనే వ్కక్తి.. ఘజియాబాద్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేయగా వారిరువురిపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ సమయంలో అమితాబ్, అభిషేక్ ఇద్దరూ జాతీయ జెండాను తమ దేహానికి కప్పుకున్నారు. ఇదే వారిద్దరిని ఇబ్బందుల్లో పడేసింది. జాతిని అవమానించే రీతిలో జాతీయ పతాకాన్ని వారి దేహాలకు కప్పుకున్నారన్న ఆరోపణతో చేతన్ ధిమాన్ కోర్టుకెక్కాడు. త్రివర్ణ పతాకాన్ని అవమానించే రీతిలో అమితాబ్ ధరించడం చేతన్ తోపాటు అతని స్నేహితులు కూడా చూశారని వారి తరఫున న్యాయవాది తెలిపాడు. అంతర్జాతీయంగా పేరున్న సినీస్టార్, ఆయన కుమారుడు ఇటువంటి చర్యలకు పాల్పడటం దేశ ఖ్యాతిని తగ్గించేందుకు పాల్పడినట్టేనని అన్నారు.
ఈ విధంగా జాతీయ జెండాను దేహాలకు కప్పుకోవడం వంటి చర్య ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’, ‘ద ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002’ కిందకు వస్తుందని.. ఈ విషయంలో వారిద్దరికీ తప్పకుండా సమన్ల జారీ చేస్తారని, విచారణకు ఖచ్చితంగా కోర్టు ఎదుట హాజరు కావాల్సి వుంటుందని తెలిపారు. మరి.. దీనిపై అమితాబ్, అభిషేక్ ల స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more