Emergency-like situation in future can`t be ruled out: LK Advani

Lk advani s comments on emergency seen as dig at pm modi

LK Advani,Emergency,RSS Advani,PM Modi Advani, l k advani, emergency, imposition of emergency, indira gandhi emergency, india emergency imposition, emergency anniversary, advani emergency fight, emergency imposition, l k advani interview, interview advani

BJP leader LK Advani has said that "forces that can crush democracy have become stronger" in India, in remarks that are being seen as a dig at Prime Minister Narendra Modi.

భారత్ లో మళ్లీ ఎమర్జెన్సీ.. బిజేపి అగ్రనేత అద్వాని

Posted: 06/18/2015 02:53 PM IST
Lk advani s comments on emergency seen as dig at pm modi

బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక జాతియ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిర హయాంలో వచ్చిన ఎమర్జెన్సీకి త్వరలో 40 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో దేశంలో తాజా రాజకీయ పరిస్థితిపై ఆయన పైవిధంగా స్పందించారు. అటు కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఆయన పరోక్షంగా నిప్పులు కురిపించారు. పనిలో పనిగా ఢిల్లీ లోని అధికార పార్టీ ఆప్ పై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి మళ్లీ రాదని తాను గట్టిగా చెప్పలేనని అద్వానీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే, రాజ్యాంగం-న్యాయరక్షణలకు విఘాతం కలిగించే శక్తులు చాలా బలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకత్వం బలహీనంగా ఉందని, ఆ నాయకత్వంపై తనకు నమ్మకం లేదంటూ నరేంద్ర మోదీపై అద్వానీ పరోక్షంగా చురకలింటించారు. దేశ విభజన ఆనాటి బ్రీటిష్ ప్రభుత్వం చేసిన తప్పిదమని.. అయితే ఎమర్జెన్సీ మాత్రం మన పాలకుల నిర్వాకమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఢిల్లీలో కోలువుదీరిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఉద్యమాలు చేసే వాళ్లు పాలనను ప్రజామోదం మేరకు సాగించలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఓవైపు సుష్మా స్వరాజ్-లలిత్‌మోడీ-వసుంధర రాజే వివాదం కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో అద్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి బీజేపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అద్వాని సహా పలువురు కురువృద్దులను పక్కన బెటిన నేపథ్యంలో మోడీ పర్కార్ పై ఆయన తన అక్కస్సును ఇలా వెళ్లగక్కాడని కూడా పలువురు బిజేపి నేతలు పేర్కోంటున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LK Advani  Emergency  bjp  narendra modi  

Other Articles