actor sai kumar, now the brand ambassador of vijayawada city police

Vijayawada city police brand ambassador sai kumar

actor sai kumar, now the brand ambassador of vijayawada city police, Tollywood hero, tollywood actor Sai Kumar, brand ambassador, Vijayawada city police, Sai Kumar, AP city police, pread various awareness campaigns, police to the public, tollywood news

Tollywood hero and actor Sai Kumar is to be the brand ambassador for the Vijayawada city police department. Sai Kumar has been roped in by the AP city police department to spread various awareness campaigns taken by the police to the public.

పోలిస్ స్టోరీ అగ్నికి లభించిన అరుదైన అవకాశం..!

Posted: 06/20/2015 03:28 PM IST
Vijayawada city police brand ambassador sai kumar


కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. ఆ కనిపించని నాలుగో సింహమేరా పోలీస్.. అంటే తనదైన శైలిలో పోలిస్ స్టోరి చిత్రంలో డైలాగ్.. తెలుగు ప్రజల గుండెలలో శిరస్థాయిగా నిలిచిపోయేలా చెప్పడంతో సక్సెస్ అయిన హీరో కమ్ నటుడు సాయికుమార్. అగ్ని అంటూ తన పేరును కూడా విభిన్నంగా పలికి.. ఆ తరువాత వచ్చిన అనే సిసిమా కథల్లో పేరడి రోల్స్ కూడా బాగా వచ్చేలా చేసింది పాయికుమార్ నటనే. ఈ చిత్రంలో ఆయన నటనకు యావదాంధ్ర రాష్ట్ర ప్రేక్షకులు మన్ననలు పోందారు.

సరిగ్గా పోలీస్ అధికారి ఇలా వుండాలి అనేలా.. ఆ పర్సనాలిటి, మాట ఉచ్చరణ, దేహదారుఢ్యంతో ఉదాహరణగా నిలుస్తారు సాయి కుమార్. అయితే ఇప్పుడదే ఆయనను కొత్త అవతరాన్ని తెచ్చిపెట్టింది. అదేంటంటారా.? ఆయనను విజయవాడ సిటీ పోలీసు శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా  నియమించింది. సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించినందుకుగాను నగర పోలీస్ కమీషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పోలీసులు ‘నాలుగో సింహం' పేరుతో ఓ యాప్ రూపొందించారు. జూన్ 21న సాయి కుమార్ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల చేయనున్నారు. విజయవాడ కమీషనరేట్ పరిధిలో పోలీసులు పలు ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సాయి కుమార్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  sai kumar  vijayawada city police  

Other Articles