స్విట్జర్లాండ్ అందాలకే కాదు అవినీతి సొమ్ముకు కూడా చాలా ఫేమస్. అయితే ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా దాదాపుగా అక్రమార్కులు అందరు కలిసి దాచుకునే స్విస్ బ్యాంకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్విస్ ఖాతాదారులకు సంబందించి ఏ దేశానికి లేనంతగా సీక్రెట్ గా మెంటైన్ చెయ్యడమే స్విస్ బ్యాంకుల ప్రత్యేకత. అయితే ప్రపంచ దేశాల్లోని ఏ దేశం అడిగినా స్విస్ బ్యాంకులు తమ ఖాతాదారుల వివరాలను ఇవ్వవు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా ఖాతాదారులకు ముందుగా ఇన్ ఫాం చేసి తర్వాత వారి పేర్లను ఆయా దేశాలకు పంపిస్తారు. అయితే మనీలాండరింగ్ ద్వారా వస్తున్న మనీలో దాదాపు అరవై శాతానికి పైగ సొమ్ము ఒక్క స్విస్ ఖాతాల్లోకే చేరుతుందని అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా స్విస్ బ్యాంకు కొన్ని సవరణలు తీసుకువచ్చింది. తమ ఖాతాదారులకు సంబందించిన వివరాలను కొన్ని కండీషన్స్ మీద తెలిపేందుకు సిద్దమైంది. అయితే ప్రపంచం మొత్తం బ్లాక్ మనీకి అడ్డాగా మారిన స్విస్ బ్యాంకులు మాత్రం తమ తప్పును ఒప్పుకోవడం లేదు.
అయితే తాజాగా నల్లధనం దాచుకునేందుకు స్వర్గధామ దేశంగా స్విట్జర్లాండ్ పేరుగాంచిందని స్విస్ అధికారికంగా ఒప్పుకుంది. మనీలాండరింగ్ ద్వారా విదేశాల్లో ఆస్తులను పోగేయాలనుకునేవారికి తమ దేశం అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారిందని పేర్కొంది. స్విటర్జాండ్‌లోని బ్యాంకులు పెద్ద ఎత్తున ఆర్థిక నేరాల సమస్యను ఎదుర్కొంటున్నాయని స్విస్ ప్రభుత్వ ఉన్నతస్థాయి మండలి అధికారికంగా ఒప్పుకుంది.మనీలాండరింగ్, తీవ్రవాద కార్యకలాపాల కోసం ఫైనాన్సింగ్ వంటి సమస్యలపై పోరాడేందుకు వ్యవస్థను మరింత పటిష్ఠపర్చాల్సిన అవసరం ఉందని మండలి అభిప్రాయపడింది. నల్లధనం సమస్యపై పోరాటాన్ని ముమ్మరం చేసిన భారత్‌తోపాటు ప్రపంచ దేశాలన్నీ స్విట్జర్లాండ్‌పై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో స్విస్ తాజా స్టేట్‌మెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more