Vijayakanth | Yoga | DMDK | Tamilnadu | Yoga day

Vijayakanths attempt to perform yoga creates hilarious moments tamil nadu

Vijayakanth, Yoga, DMDK, Tamilnadu, Yoga day

Vijayakanths attempt to perform yoga creates hilarious moments Tamil Nadu Although the Captain was supposedly leading the yoga event, he appeared clueless and was continuously looking around for help from fellow volunteers.With a huge poster of him performing an asana in the background, the DMDK chief could not even perform simple breathing exercise as he didn’t know which nostril to press and which to release.

ITEMVIDEOS: కెప్టెన్ విజయ్ కాంత్ యోగా.. కేక

Posted: 06/23/2015 12:08 PM IST
Vijayakanths attempt to perform yoga creates hilarious moments tamil nadu

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం యోగా చేసింది. ఆరోగ్యానికి యోగా ఎంతో ప్రయోజనం అన్న కాన్సెప్ట్ తో యోగా పని చేస్తోంది. అయితే ఢిల్లీ నుండి గల్లీ దాకా అందరూ యోగా బాట పట్టారు. యోగా చెయ్ బాగా.. ఆరోగ్యాన్ని పెంచుకో అన్నట్లు అందరూ వీలైనంత వరకు యోగా చేశారు. అసలే యోగా దినోత్సవం మరి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే రాజకీయ నాయకులకు మంచి అవకాశం దాంతో యోగా చెయ్యడానికి చాలా మందే ముందుకు వచ్చారు. అయితే తమిళనాట డిఎండికె పార్టీ అధినేతగా, కథానాయకుడిగా మంచి పేరున్న కెప్టెన్ విజయ్ కాంత్ కూడా పార్టీ కార్యాలయంలో యోగా చేశారు. ఆ చేస్తే చేశారు దానికి అంతలా చెప్పాలా అని అనుకోకండి.ఎందుకంటే విజయ్ కాంత్ చేసిన యోగా చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా నవ్వొస్తుంది.

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని నాడు వేమన చెప్పారు.. కానీ అదే సూత్రాన్ని యోగాలందు విజయ్ కాంత్ యోగా వేరయా అని చెప్పాల్సి వస్తుందేమో. ఎందుకంటే యోగా చెయ్యడం రాని విజయ్ కాంత్ ఆపసోపాలు పడ్డారు. ఏదోలో యోగా టైంను దాటించేసి మమ అనిపించేద్దాం అనుకుంటే డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. తన సహచరులు, అభిమానుల మధ్య విజయ్ కాంత్ యోగా చెయ్యాల్సి వచ్చింది. అయితే విజయ్ కాంత్ కు కనీసం ఒక్క ఆసనం కూడా వెయ్యడానికి రాలేదు. కానీ ట్రెయినర్ చూపిస్తుంటే మాత్రం రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో కేక పెట్టించారు. ఇక అంతా అయిపోయాక మాత్రం భలే డైలాగులు చెప్పారు. తాను కూడా రెగ్యులర్ గా యోగా చేస్తానని.. తన ఫిట్ నెస్ సీక్రెట్ కూడా అదే అని తెలిపారు. అయినా కనీసం చూసి కూడా నేర్చుకోలేని విజయ్ కాంత్ కూడా రెగ్యులర్ గా యోగా చేస్తారా అని జనాలు అనుకుంటున్నారట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayakanth  Yoga  DMDK  Tamilnadu  Yoga day  

Other Articles