tdp leader varla ramaiah demands to investigate ys jagan mohan reddy in vote for note controversy

Tdp leader varla ramaiah demands to investigate ys jagan mohan in vote for note

varla ramaiah, ys jagan mohan reddy, nayini narsimha reddy, vote for note, phone tapping, varla ramaiah press meet, nayini narsimha reddy controversy, ys jagan controversies, vote for cash controversy, phone tapping controversy

tdp leader varla ramaiah demands to investigate jagan mohan in vote for note : tdp leader varla ramaiah demands to investigate ys jagan mohan reddy in vote for note controversy. And also he given reply to nayini comments to ready arrest in phone tapping.

‘ఓటుకు నోటు’ కేసులో జ‘గన్’

Posted: 06/24/2015 10:43 AM IST
Tdp leader varla ramaiah demands to investigate ys jagan mohan in vote for note

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ‘ఓటుకు నోటు’ కేసులో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పాత్ర కూడా వుందా? టీడీపీ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆయన టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపించారా? ఈ విధంగా వెలువడుతున్న ఈ అనుమానాలకు ఖచ్చితమైన సమాధానాలు ఎవరిదగ్గరా లేవు కానీ.. ప్రస్తుతం ఈ వార్తలు బాగానే చక్కర్లు కొడుతున్నాయి. ‘ఓటుకు నోటు’ కేసులో జగన్ కూడా కీలకపాత్ర వహించాడన్న ప్రచారం జరుగుతోంది. పైగా.. ఈ వ్యవహారంపై జగన్ కాస్త మౌనంగా వున్న నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

అందుకేనేమో.. టీడీపీ వర్గాలు ‘ఓటుకు నోటు’ కేసులో భాగంగా అటు టీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు ఇటు జగన్ మీద కూడా మండిపడుతున్నాయి. టీఆర్ఎస్ తో కుమ్మక్కై జగన్ ఈ వ్యవహారం నడిపించారని.. ఈ కేసులో జగన్ పాత్ర కూడా వుందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకే ఆ పార్టీ వర్గాలు జగన్ మీద కూడా విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య కూడా జగన్ మీద మరోసారి ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో జగన్ పాత్ర కూడా వుందని.. అతని కాల్ డేటాను పరిశీలించి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరి.. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే!

అలాగే.. ఫోన్ ట్యాపింగ్ విషయంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్న వ్యాఖ్యలపై కూడా వర్ల స్పందించారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిజమని తేలితే తాము జైలుకెళ్లేందుకు సిద్ధమని నాయిని పేర్కొన్న విషయం తెలిసిందే! ఆ వ్యాఖ్యలపై తాజాగా వర్ల స్పందిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలను త్వరలోనే బయటపెట్టనున్నామని.. జైలుకెళ్లేందుకు నాయిని సిద్ధంగా వుండాలని వర్ల పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varla ramaiah  ys jagan mohan reddy  phone tapping  vote for note  

Other Articles